Breaking News

AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!

Published on Sat, 05/25/2024 - 09:31

విశాఖపట్నం : జూన్‌ 4వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గం,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన సిబ్బంది నియామకం,రౌండ్లు వివరాలు,టేబుల్స్‌ ఏర్పాటు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.మల్లికార్జున రిటర్నింగ్  అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.ఈటీíపీఎస్‌ ఓట్లు(సర్వీసెస్‌) ఓట్లు లెక్కింపు మొదలవుతుంది.ఆ తర్వాత ఉద్యోగులు వేసిన ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ఈవీఎంలను లెక్కింపు మొదలు పెడతారు.  జిల్లాలో నాలుగు వేల మంది వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉండగా, శుక్రవారం నాటికి 891 కలెక్టరేట్‌కు చేరుకున్నాయి.  మొత్తం పోస్టల్‌ బ్యాలెట్స్,ఉద్యోగుల ఓట్లు లెక్కింపును మూడు రౌండ్లులో పూర్తి చేయవలసి ఉంది. 

పశ్చమదే తొలి ఫలితం 
మొదటి ఫలితం విశాఖ పశ్చమ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. పోలైన ఓట్లు ఆధారంగా 16 రౌండ్లు విభజించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దక్షిణం 17 రౌండ్లకు విభజించారు. ఆ ఫలితం కూడా 3.30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా భీమిలి ఫలితం వెలువడనుంది. ఇక్కడ 26 రౌండ్లు వచ్చాయి. దీని వల్ల రాత్రి 7.30 గంటలకు ఫలితం వస్తుందని అంచనా వేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)