Breaking News

కదం తొక్కిన వలంటీర్లు

Published on Tue, 09/24/2024 - 05:32

సాక్షి, అమరావతి/సీతమ్మధార : రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్‌ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి  తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఆందోళనలు నిర్వహించారు. 

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల వేదికలో వలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెకర్లను కలిసి ఈ మేరకు వినతిపత్రాలను అందజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు. 

కూటమి ప్రభుత్వం వలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ నెల 26 నుంచి 2 వరకు వలంటీర్లు శాంతియుత నిరసనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఫ్‌ పిలుపునిచ్చింది. 

వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోండి
వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీ­ఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వలంటీర్‌ అసో­సియేషన్‌ ఆధ్వరం్యలో వలంటీర్లు సోమవారం ధర్నా నిర్వ­హిం­చారు. ఈ సందర్భంగా  అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వలంటీర్ల­ను విధుల్లోకి తీసుకుంటామని, ప్రతి నెల రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకో­వాలని డిమాండ్‌ చేశారు. 

పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడు­దల చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామా చేసిన వలం­టీర్లను తిరిగి కొనసాగించాలన్నారు. వలంటీర్ల ధర్నాకు సీఐటీ­యూ సంఘీభావం ప్రకటించింది. 

ధర్నాలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటసుబ్బయ్య, భవానీప్రసాద్, కోడూరి రాము, పెంచలయ్య, బాలకృష్ణప్రసాద్, కోడూరు లక్ష్మణ్, ఆంజనేయులు, అజార్, రాజు, పార్వతి, గుణసాయి, కె.రాజు, సంధ్య, శృతి, గాయత్రి, నాగపుష్ప, భారతి, సీఐటీయూ విశా­ఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్‌వీ కుమార్,    సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్‌.జ్యోతీశ్వరరావు, కె.కుమార­మంగళం, జి.అప్పలరాజు తదితరులున్నారు.

ఏం చేశారని 100 రోజుల సంబరాలు.. బాబు పై వాలంటీర్లు ఫైర్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)