Breaking News

యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్‌

Published on Sun, 02/11/2024 - 05:11

బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్‌ కాపాడాడు. ప్రాథమిక చికి­త్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘట­న బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్‌ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది.

ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారో­గ్యం బారిన పడ్డాడు. గోపీచంద్‌ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడి­ని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపాని­కి గురైన గోపీచంద్‌ ఇంట్లోనే పురుగుమందు తాగా­డు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్‌ క్లస్టర్‌ వలంటీర్‌ బత్తుల రమేశ్‌బాబు..గోపీచంద్‌ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు.

బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వలంటీర్‌.. గోపీచంద్‌కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్‌పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్‌ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్‌ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్‌.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)