కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు

Published on Sat, 09/14/2024 - 04:38

విజయనగరం క్రైమ్‌: చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్‌ ఆలయం ప్రాంతంలో కొండపై విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి చెందిన సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా ఇటీవల చార్‌ధామ్‌ యాత్రకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు 30 మంది వెళ్లారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో భక్తులు కొండలపైనే నిలిచిపోయారు. 

జిల్లాకు చెందిన నలుగురిలో గొట్టాపు త్రినాథరావు దంపతులు గురువారం హెలికాప్టర్‌లో కొండ కిందకు వచ్చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ కొట్నాన శ్రీనివాసరావు, ఆయన భార్య హేమలత ఇంకా కేదార్‌నాథ్‌ కొండపైనే ఉన్నారు. కేదార్‌నాథ్‌ ఆలయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేదని హెలికాప్టర్‌ ప్రయాణం నిలిపివేశారని, తాము కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు స్థానిక విలేకరులకు వారు శుక్రవారం ఫోన్‌లో తెలిపారు. 

భోజన, వసతి లభించక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. శుక్రవారం కొంత మేరకు వాతావరణం సహకరించడంతో రెండు హెలికాప్టర్‌లు మాత్రమే కేదార్‌నాథ్‌ ఆలయం వద్దకు వెళ్లగలిగాయని, అయితే వాటిలో ఏపీ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో కొండపైనే ఉండిపోయారని తెలిసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)