Breaking News

జనాల్లోకి దూసుకెళ్లిన గుర్రం, ఎడ్ల బండి

Published on Sat, 01/17/2026 - 09:43

విశాఖపట్నం జిల్లా: మండలంలోని అనంతవరంలో శుక్రవారం గుర్రపు, ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో ఓ గుర్రం, మరో ఎడ్ల బండి గాడితప్పి జనాల్లోని దూసుకు పోవడంతో నలుగురు గాయపడ్డారు. ఈ పందాలకు విజయనగరం జిల్లా జామి మండలం అలమండ, కొట్యాడ, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి తదితర ప్రాంతాల నుంచి పది గుర్రాలు, విజయనగరం జిల్లా కొట్టాం, బోనంగి, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నుంచి 12 ఎడ్లు బళ్లు వచ్చాయి. ముందుగా గుర్రపు పందాలు ప్రారంభించారు. నాలుగు గుర్రాలు బాగానే లంకించాయి. ఐదో గుర్రాన్ని పందెంలోకి దించారు. 

కొద్దిగా ముందుకు పరుగు తీసి జనాల్లోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో గుర్రం పైన కుర్చున్న దేవరాపల్లికి చెందిన నవీన్‌కు, పందాలను తిలకించేందుకు వచ్చిన అన్నవరానికి చెందిన జి.ఎర్నిబాబు(53) కుడికాలి మోకాలు భాగంలో గాయాలయ్యాయి. ఎడ్ల బండ్ల పందాలు ట్రైల్‌ రన్‌ చేస్తుండగా జోడెద్దులు బండితో పాటు జనాల్లోకి దూసుకు వెళ్లాయి. ఈ సంఘటనలో అనంతరం పంచాయతీ గొల్లలపాలేనికి చెందిన చందక శ్రావణి(33), అల్లబోని పైడమ్మ(49) గాయపడ్డారు. 108 ఈఎంటీ తిరుపతి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)