Breaking News

విశాఖ విమానాశ్రయం రన్‌వే రీ సర్వీసింగ్‌.. 4 నెలల పాటు ఆంక్షలు

Published on Sat, 08/05/2023 - 09:58

సాక్షి, విశాఖపట్నం: రక్షణశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం అంతార్జాతీయ విమానాశ్రయంలో పదేళ్లకోసారి నవీకరణ పనులు జరగనున్నాయి. రన్‌వే పునరుద్ధరణ కోసం పనులు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా నిలిపివేయనున్నారు. దాదాపు నాలుగు నెలలపాటు (నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు వరకు) రీ-సర్వీసింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మూసివేయాలని నేవీ ప్రతిపాదించింది. దీంతో  విశాఖ - సింగపూర్ విమానంతో పాటు , 12 సర్వీసులు నిలిచిపోతాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమాన సేవలతో పాటు కోల్‌కతా, పుణె విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మరో వైపు విశాఖ ఆర్ధిక వ్యవస్థ, వివిధ వ్యాపారాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.

ఈ సమయంలో విమానాశ్రయాన్ని రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 వరకు పరిమితం చేస్తే కొంతవరకు ఉపశమనం ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా వైజాగ్ ఎయిర్​పోర్టు భారత నావికాదళం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్​క్రాఫ్ట్​లు ఐఎన్​ఎస్ డేగా రన్​వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్​ వే మీదుగానే జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్​వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది.

చదవండి:  వైజాగ్‌ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)