Breaking News

బ్రెడ్‌ తింటూ.. బాత్రూం నీరు తాగుతూ..!

Published on Tue, 01/28/2025 - 07:57

విశాఖ సిటీ: రోజూ రెండు బ్రెడ్లు కోసం పది మంది కొట్టుకుంటూ.. బాత్‌రూమ్‌లో నీటినే తాగుతూ.. నెలల తరబడి నరకయాతన అనుభవించారు. విదేశాల్లో వేర్‌హౌస్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌ ఉద్యోగం వచ్చిందని కోటి ఆశలతో విమానం ఎక్కిన నిరుద్యోగులతో అక్కడ బాత్‌రూమ్‌లు కడిగించారు. తోటల్లో గడ్డి కత్తిరిస్తూ.. కూలి పనులు చేయించారు. 

Students Facing Problems ఆకలి బాధలు తట్టుకోలేక.. ఉత్తరాంధ్రకు చెందిన 25 మంది తిరిగి విశాఖకు చేరుకొని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. యూరప్‌లోని పలు దేశాల్లో వేర్‌హౌస్‌లో స్టోర్‌ కీపర్‌, సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 2023లో నూజ్‌ కెరీర్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ వారు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.

క్యాబ్‌ డ్రైవరే కంపెనీ ఓనర్‌ అని..
విదేశాల్లో ఉద్యోగం వస్తుందని భావించిన పలువురు నిరుద్యోగులు సదరు కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. వీరికి నగరంలోని ఓ హోటల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందులో యూరప్‌లోని ఒక ట్యాక్సీ డ్రైవర్‌ను తీసుకువచ్చి కంపెనీ ఓనర్‌గా నిరుద్యోగులకు పరిచయం చేశారు. అతని కంపెనీలోనే పనిచేయాల్సి ఉంటుందని, అతడే అందరికీ జీతాలు ఇస్తాడని నమ్మించారు.

10 మందికి రెండు బ్రెడ్లే..
జీవితంలో స్థిరపడవచ్చన్న ఆశతో విమానం ఎక్కిన నిరుద్యోగులు అక్కడికి వెళ్లాక నరకయాతన అనుభవించారు. అగ్రిమెంట్‌ ప్రకారం సదరు కంపెనీకి వెళ్లగా.. అవి ఉద్యోగానికి సంబంధించినవి కాదని, నకిలీవని ఆ ఒప్పంద పత్రాలను చింపేశారు. వారిని ఒక లేబర్‌ క్యాంప్‌నకు తరలించారు. అక్కడ ఓ చిన్న రూమ్‌లో పది మంది చొప్పున ఉంచారు. స్టోర్‌కీపర్‌, సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు కాకుండా బాత్‌రూమ్‌లు కడిగించారు. అలాగే పొలాల్లో గడ్డి తీయడం, పండ్లు కోసే పనులు చేయించారు. రూమ్‌లో పది మంది ఉంటే.. రోజుకు కేవలం రెండు బ్రెడ్లు మాత్రమే పంపించేవారు. దీంతో ఆకలి తీర్చుకోడానికి ఆ బ్రెడ్ల కోసం కొట్టుకునేవారు. తాగడానికి నీరు లేక బాత్‌రూమ్‌లో నీటినే తాగేవారు. 

ఇలా కొద్ది నెలలు తీవ్ర ఇబ్బందులు పడి, ఇక ఉండలేక అతికష్టం మీద తిరిగి విశాఖకు చేరుకున్నారు. నూజ్‌ కన్సల్టెన్సీ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కన్సల్టెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొహిసిన్‌ అహ్మద్‌షేక్‌ను సంప్రదించారు. దీంతో అతడు మరి కొద్ది రోజుల్లో ఇటలీ, చెక్‌రిపబ్లిక్‌, ఇతర దేశాలకు పంపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ తరువాత కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. వారు స్పందించలేదు. ఫిర్యాదు చేస్తే చేసుకోవచ్చని చెప్పడంతో బాధితులు సోమవారం పోలీస్‌ సమావేశ మందిరంలో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఒక్కొక్కరి నుంచి రూ.7.5 లక్షలు వసూలు
ఈ ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.7.5 లక్షలు నుంచి రూ.8 లక్షలు వసూలు చేశారు. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 25 మంది వరకు డబ్బులు కట్టారు. అయితే నెలలు గడుస్తున్నా వారిని విదేశాలకు పంపించలేదు. దీంతో వారు కన్సల్టెన్సీ ప్రతినిధులపై ఒత్తిడి పెంచారు. ఆరు నెలల తరువాత నకిలీ అగ్రిమెంట్లు, నకిలీ వీసాలతో దక్షిణ యూరప్‌లోని మాంటెనెగ్రో దేశానికి పంపించారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)