Breaking News

విశాఖ మెట్రో రైలు పనులకు ఆమోదం

Published on Tue, 12/03/2024 - 05:18

సాక్షి, అమరావతి: విశాఖపట్నం మెట్రోరైల్‌ నిర్మా­ణం మొదటి దశ పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. రూ.14,309 కోట్లతో 4 కారిడార్లలో 76.90 కి.మీ మేర రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా రూ.­11,498 కోట్లతో 46.23 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.

పీపీపీ విధానంలో చేపట్టే ఈ పనులకు ఆమోదం తెలుపుతూ సోమ­వారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె. కన్న­బాబు ఉత్తర్వులిచ్చారు. ఇందులో స్టీల్‌ప్లాంట్‌ జంక్షన్‌ నుంచి కొమ్మాది వరకు 34.40 కి.మీ., గాజువాక నుంచి ఓల్డ్‌ పోస్టాఫీస్‌ వరకు 5.05 కి.మీ., తాటిచెట్లపాలెం నుంచి చిన­వాల్తేరు వరకు 6.75 కి.మీ. మేర మూడు కారిడార్లలో పనులు చేపట్టనున్నారు. 

ఫేజ్‌–2 కింద కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కి.మీ పనులు చేపడతారు. ఈ ప్రాజెక్టును కేంద్రం 40 శాతం, ప్రైవేటు డెవలపర్స్‌ 60 శాతం వాటా భరిస్తాయి. 

విజయవాడ లైట్‌ మెట్రో రైలు డీపీఆర్‌కు కూడా..
విజయవాడ కేంద్రంగా అమరావతి, గన్నవరం తదితర ప్రాంతా­లను కలుపుతూ నిర్మించ తలపెట్టిన లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు కూడా ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఫేజ్‌–1లో 1ఏ, 1బీ కారిడార్ల కింద 38.30 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో రూ.11,009 కోట్లతో నిర్మాణ పనులు, మరో రూ.1,152 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నారు. 

ఫేజ్‌–2లో 27.75 కి.మీ మేర నిర్మాణం చేపడతారు. కారిడార్‌ 1ఏ గన్నవరం నుంచి పండిట్‌ నెహ్రూ బస్టాండ్, 1బీ కారిడార్‌ పనులు పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు, కారిడార్‌–3 పనులు పీఎన్‌బీఎస్‌ నుంచి అమరావతి (రిజర్వాయర్‌ స్టేషన్‌) వరకు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)