Breaking News

కప్పరాడ భూదందాపై చర్యలు తీసుకోవాలి

Published on Tue, 07/14/2026 - 07:56

ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గం, 49వ వార్డు మురళీనగర్, కప్పరాడ సర్వే నంబర్‌ 13లోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్‌ చేశారు. నిరుపేద బర్మా కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అభిíÙక్త్‌ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కనిపించకపోగా, ఉత్తరాంధ్రలో విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కార్పొరేట్లు, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలకు విలువైన భూములను కట్టబెట్టే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.


తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బర్మా కాందిశీకులు

బర్మా కాందిశీకుల స్థలాల ఆక్రమణలు 
బర్మా కాందిశీకుల భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం గతంలో కేటాయించిన సుమారు 3 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణా లు చేపడుతున్నారని ఆరోపించారు. ఆ స్థలాలను రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు రెవెన్యూ, పోలీ స్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనే బెదిరింపులు, ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణాలు తొలగించాలి 
సర్వే నెం.13లోని అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆ భూమిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అక్కడ నివసిస్తున్న నిజమైన బర్మా కాందిశీకుల అభిప్రాయాన్ని గ్రామసభ ద్వారా తెలుసుకుని, చట్టబద్ధంగా అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో 49వ వార్డు మాజీ కార్పొరేటర్‌ అల్లు శంకరరావు, నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)