Breaking News

ఇసుక దోపిడీ దారుణంగా ఉంది

Published on Tue, 11/26/2024 - 06:25

మహారాణిపేట (విశాఖ): శ్రీకాకుళంలోని ఇసుక రీచ్‌లలో దళారుల దోపిడీ దారుణంగా ఉందని, వారి నుంచి తమను కాపా­డాలని విశాఖ కలెక్టర్‌కు క్వారీ లారీ ఓనర్స్‌ మొరపెట్టుకున్నారు. విశాఖ జిల్లా క్వారీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ ప్రతినిధులు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే ఇసుక విధానం పారదర్శకంగా ఉండేదని చెప్పారు. కూటమి నాయకులు ఇసుక రీచ్‌ల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టన్ను ఇసుకకు అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారని, ఎందుకు అదనంగా ఇవ్వాలని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే ఉచితంగా వస్తుందనుకున్నామని, కానీ డబ్బులు చెల్లించాలనడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళంలోని 11 ఇసుక రీచ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖలో ఇసుక అమ్మాలంటే టన్ను రూ.వెయ్యి కంటే తక్కువకు విక్రయించలేని పరిస్థితి ఉందన్నారు.

సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే మీరు ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్‌ కార్యదర్శి కర్రి రమణ తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)