Breaking News

త్వరలో విశాఖ–బెంగళూరు వందేభారత్‌ స్లీపర్‌ రైలు!

Published on Sun, 08/02/2026 - 05:53

సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే వందేభారత్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను వైజాగ్‌ నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.  ఈ రెండు ప్రధాన నగరాల మధ్య అధునాతన వందేభారత్‌ స్లీపర్‌ను నడపాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు సాధ్యాసాధ్యాలు, మార్గమధ్యంలో ఇతర రైళ్ల క్రాసింగ్స్, ప్రతిపాదిత టైమింగ్స్, తలెత్తే ఇబ్బందులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డీఆర్‌ఎంలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సీపీటీఎం షిఫాలీ కుమార్‌ ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. 

ఆయా డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ రిపోర్టు వచ్చిన అనంతరం రైల్వే బోర్డుకు తుది ప్రతిపాదనలు పంపుతారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన వెంటనే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ వందేభారత్‌ స్లీపర్‌ రైలు విశాఖ నుంచి పట్టాలెక్కనుంది.  ప్రతిపాదనల ప్రకారం వారంలో ఆరు రోజుల పాటు రాత్రిళ్లు ఈ సర్వీస్‌ నడుస్తుంది. రైలు విశాఖలో బయలుదేరిన తర్వాత దువ్వాడ, విజయవాడ, కృష్ణా కెనాల్‌ జంక్షన్, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం మీదుగా బెంగళూరు చేరుకుంటుంది.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)