Breaking News

వైఎస్‌ జగన్‌ను కలిసిన స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు

Published on Thu, 10/09/2025 - 12:00

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై కార్మికులు.. వైఎస్‌ జగన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ వారితో మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే స్టాండ్‌. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఒప్పుకోం. స్టీల్‌ప్లాంట్‌ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాశాం. స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంట్‌లోనూ ప్రశ్నిస్తాం అని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్‌ జగన్‌కు స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌కు రావాలని వైఎస్ జగన్‌ను ఆహ్వానించాం. స్టీల్‌ ప్లాంట్‌కు వచ్చి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. మాకు మద్దతు ఇచ్చిన వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. 

మరోవైపు.. విశాఖలో వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ బాధితులు వచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు విశాఖకు తరలి వచ్చారు. ఈ క్రమంలో జి.భీమవరం వద్ద పోలీసులు.. మత్స్యకారులను అడ్డుకున్నారు. వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో, ఎలాగైనా వైఎస్‌ జగన్‌ను కలిసి తీరుతామని మత్స్యకారులు తెలిపారు. అనంతరం, కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

జగనన్న స్టీల్ ప్లాంట్ కు రా ...!

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)