Breaking News

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆందోళన

Published on Tue, 03/11/2025 - 09:10

సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపును నిరసిస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వెయ్యి మంది కాంట్రాక్ట్‌ కార్మికులను యాజమాన్యం తొలగించగా.. మరికొందరిని తొలగించే యోచనలో ఉంది. నేటితో యాజమాన్యం కోరిన గడువు ముగియనుంది. నేడు రిజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరపనున్నారు. స్పష్టత ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది.

కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపుపై సమావేశం కొనసాగుతోంది. యూనియన్‌ నేతలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమావేశమైంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై చర్చలు కొలిక్కి రాలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని... తొలగించిన వాటిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్‌ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమనే హామీ ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రాలేదని.. యాజమాన్యం చెబుతోంది ఒకటి, చేస్తోంది ఒకటని కార్మికులు మండిపడుతున్నారు.

స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అక్రమ తొలగింపులను ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాతగాజువాకలో ఆదివారం మహాధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.

స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అందులో భాగంగా ప్రైవేట్‌ పెట్టుబడిదారులు కోరినట్టుగా ఇక్కడి కార్మికుల సంఖ్యను తగ్గిస్తోందన్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న నాయకులకు యాజమాన్యం షోకాజ్‌ నోటీసులను జారీ చేయడం దుర్మార్గమని సీపీఎం నేతలు ధ్వజమెత్తారు.

 

 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)