బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...
Breaking News
మద్యం మత్తులో మాస్టారు
Published on Sat, 07/25/2026 - 11:15
అల్లూరి సీతారామరాజు జిల్లా: విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య మాల్లో వైరల్గా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా లోతుగెడ్డ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న కేవీ రమణను ఇటీవల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని బెన్నవరం గ్రామ పంచాయతీ పినపాడు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలకు డిప్యుటేషన్పై నియమించారు.
పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. అయి తే, అప్పటికే సంబంధిత ఉపాధ్యాయుడు మ ద్యం మత్తులో ఉండడంతో సీఆర్పీ రాము సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఊగుతూ ఉండడాన్ని గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మండిపడ్డారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేయడంతో అది వైరల్గా మారింది.
Tags : 1