పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. పైసలిస్తే పోస్టింగ్‌

Published on Wed, 07/15/2026 - 04:33

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగుల సంస్థ టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కేంద్రంగా మారిపోయింది. నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తూ ఆ పార్టీ కార్యకర్తలతో నింపేసుకుంటున్నారు. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. పైసలిస్తే పోస్టింగ్‌ అన్నట్టుగా మార్చేశారు. అవుట్‌సోర్సింగ్‌ పేరిట అడ్డగోలుగా నియామకాలు చేసుకుంటూ వసూళ్ల దందా సాగిస్తున్నారు.  

ఆ ఐదేళ్లూ పారదర్శకతకు పెద్దపీట 
దాదాపు ఐదేళ్ల పాటు గణనీయమైన అభివృద్ధి సాధించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థను అధికార టీడీపీ నేతలు నేడు అవినీతికి అలవాలంగా మార్చేశారు. 2018–19 నాటికి 6.34 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములతో ఉన్న ఈ సంస్థ వైఎస్‌ జగన్‌ హయాంలో అద్భుతమైన పురోగతి సాధించింది. దాదాపు రూ.195 కోట్లతో 2.50 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 53 కొత్త గోదాములను నిర్మించారు. దాదాపు రూ.21 కోట్లతో ఉన్న గోదాములను ఆధునికీకరించారు. ఫలితంగా రికార్డు స్థాయిలో సుమారు రూ.200 కోట్ల లాభాలను ఆర్జించింది. అలాంటి గిడ్డంగుల సంస్థను నిర్వీర్యం చేస్తూ ఎడాపెడా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.   

నేడు నిబంధనలకు పాతర 
అడ్డగోలు నియామకాలు.. అవినీతి దందాలతో గిడ్డంగుల సంస్థను కాసులు కురిపించే కామధేనువుగా మార్చేసుకున్నారు. అవుట్‌సోర్సింగ్‌ నియామకాల కోసం 2023లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి నియామకాలు జరుపుతున్నారు. సంస్థ చైర్మన్‌గా రావి వెంకటేశ్వరరావు నియమితులైన నాటినుంచి నియామకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ సైతం పాటించడం లేదు. కేవలం ఏడాదిన్నరలోనే 103 మంది వరకు జూనియర్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వే బ్రిడ్జి ఆపరేటర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్ల పేరిట కేటగిరీని బట్టి రూ.15 వేల నుంచి రూ.21,500 వరకు జీతభత్యాలతో నియమించారు. 

ఈ పోస్టుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా సీనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ ఇప్పిస్తామని, త్వరలోనే పర్మినెంట్‌ చేయిస్తామని నమ్మబలుకుతూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో అవసరానికి తగినట్టుగానే నిబంధనలకు లోబడి నియామకాలు జరిపేవారని, ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా డబ్బులిచ్చే వారిని ఎమ్మెల్యేల సిఫార్సులతో అడ్డగోలుగా నియామకాలు చేపడుతున్నారని చెబుతున్నారు.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)