Breaking News

లంకల్లో మట్టిని మింగేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకోండి

Published on Sun, 01/26/2025 - 04:59

కొత్తపేట: ఉచిత ఇసుక మాటున టీడీపీ నేతల అండదండలతో జరుగుతున్న ఇసుక, మట్టి అక్ర­మ తవ్వకాలను వెంటనే అరికట్టాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట, కపి­లేశ్వరపురం మండలాల సరిహద్దు ప్రాంతమైన నారాయణలంక గ్రామస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. నారాయణలంక సమీపాన గోదావరి లంక ప్రాంతంలో రెండు రోజులుగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. 

అనధికారి­కంగా ఇసుక ర్యాంపు నిర్వహణకు పొలాల మధ్య నుంచి పూర్తి స్థాయిలో బాట ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ­స్తులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందు­కున్న కపిలేశ్వరపురం తహసీల్దార్‌ చిన్నారావు, అంగర ఎస్సై రవికుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అడ్డూ అదుపూ లేని ఇసుక, మట్టి తవ్వకాలతో గోదావరి వరదల సమయంలో తమ జిరాయితీ భూములు కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా­రు. వరదల కారణంగా ఇప్పటికే వందలాది ఎకరాలు నదీగర్భంలో కలిసిపోయాయని ఆవే­ద­న వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఎటువంటి అను­మతి లేకుండా రాత్రి వేళల్లో యంత్రాలతో ఇసుక, బొండు మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారని ఆరోపించారు. 

వాహనాల్లో ఇసుకను తరలించేందుకు తమ పొలాల్లోంచి అక్రమంగా బాట వేశారని కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ చిన్నారావు మాట్లాడుతూ, అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఈ సమస్యపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)