Breaking News

గ్రామ సర్వేయర్లకు అగచాట్లు

Published on Mon, 03/10/2025 - 04:48

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో భూముల రీ సర్వేలో కీలకపాత్ర పోషించిన గ్రామ సర్వేయర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అగచాట్లు పడుతున్నారు. వారు చేయాల్సినవే కాకుండా అదనపు పనులు అప్పగిస్తూ ఇబ్బందులు పెడుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల్టిపుల్‌ పనులు చేసే జాబితాలో పెట్టడంతో గ్రామ సర్వేయర్లపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే సెటిల్‌మెంట్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖలు పెత్తనం చేస్తున్నాయి. 

సర్వేయర్లపై సచివాలయ కార్యదర్శి, తహశీల్దార్, ఎంపీడీవో, మండల సర్వేయర్‌.. బాస్‌లుగా ఉన్నారు. ఈ నాలుగు శాఖల బాస్‌లు ఒకే సమయంలో వివిధ రకాల పనులను అప్పగిస్తున్నారు. ఏ పని చేయకపోయినా షోకాజ్‌ నోటీసులు, మెమోలతో హడలెత్తిస్తున్నారు. వాస్తవానికి సర్వేయర్లకు మాతృ శాఖ సర్వే సెటిల్‌మెంట్, ల్యాండ్‌ రికార్డుల శాఖ. వారి ప్రధాన పని భూముల రీ సర్వే చేయడమే. కానీ ఇప్పుడు ఆ పనితో పాటు పీ–4, హౌస్‌ హోల్డ్‌ తదితర సర్వేలు కూడా చేయిస్తున్నారు. 

ఒకే సమయంలో అన్ని పనులూ చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సర్వేయర్లు పనిచేయక తప్పడం లేదు. వారికి సంబంధించిన రీ సర్వే పని చేసినా.. ఆ తర్వాత రెవెన్యూ శాఖ చేయాల్సిన యాజమాన్య హక్కుల నిర్ధారణ (టైటిల్‌ కన్‌ఫర్మేషన్‌) పని కూడా వీరిపైనే పడుతోంది. రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంతో పాత రికార్డుల్లో ఉన్న వివరాలతోనే 1బీ, అడంగల్‌ రికార్డులు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆ తప్పులన్నింటికీ సర్వేయర్లనే బాధ్యులుగా చేసి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. 

అలాగే అనేక ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులకు కూడా గ్రామ సర్వేయర్లనే బాధ్యులుగా చేస్తుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ల్యాప్‌టాప్, ఇతరత్రా పరికరాలు ఇవ్వకుండానే పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా.. ఉదయం సంబంధిత సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్‌ హాజరు కచ్చితంగా వేయాలంటూనే.. మరోవైపు ఇతర ప్రాంతాల్లో పనులు అప్పగిస్తున్నారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. 

ఇన్ని పనులు చేసినా పదోన్నతుల చానల్‌ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు గ్రామ సర్వేయర్లు వాపోతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దికరణలో 4,700 మందికి పైగా గ్రామ సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపించారు. వారికి ఇతర శాఖల్లో బదిలీలకు ఆప్షన్‌ ఉన్నా.. అది కూడా అమలు చేయడం లేదు.  

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)