Breaking News

రేపు చలో విజయవాడ

Published on Mon, 10/06/2025 - 05:20

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా.. బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడింది. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్‌లో జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టినా స్పందించలేదని.. అందుకే ఈనెల 7న ‘చలో విజయవాడ’ పేరుతో మహా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్‌ ఎల్‌.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్‌.చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యా సంస్కరణలపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్‌మెంట్ల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్విస్‌ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు డీఏ బకాయిలు, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యా‹Ùమెంట్‌ వంటి అనేక డిమాండ్లు పరిష్కరించలేదని.. ఐఆర్‌ ఇవ్వలేదని, పీఆర్సీ నియమించలేదని వాపోయారు.

గత ప్రభుత్వం తెచి్చన హైసూ్కల్‌ ప్లస్‌లను పూర్తిగా నిర్విర్యం చేశారని.. అక్కడి పోస్టులను సర్‌ప్లస్‌ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. తాము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నా వైద్యం చేయించుకోలేకపోతున్నామని మండిపడ్డారు. ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. సర్విసులో 
ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు. అందుకే ఈనెల 7న ఉద్యమించబోతున్నట్లు తెలిపారు.  

పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతు
ఈనెల 7న ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘా­ల సమాఖ్య తలపెట్టిన చలో విజయవాడ కార్య­క్ర­మానికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్‌ టీచర్స్‌ అసోయేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు­లు అశోక్‌ కుమార్‌రెడ్డి, గెడ్డం సుధీర్, స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.  రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ సైతం ధర్నాకు మద్దతు పలికింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)