Breaking News

మార్చి 26 నుంచి విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు

Published on Sun, 02/26/2023 - 05:11

విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ ముందుకురా వడంతోపాటు ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్‌ 72–600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరి మూడు గంటలకు షిర్డీ చేరుకుంటుంది.

అలాగే షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుతుందని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ వర్గాలు తెలిపాయి. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్‌ ధర రూ.4,246గా, షిర్డీ నుంచి ఇక్కడికి రూ.4,639గా నిర్ణయించారు. ఇప్పటివరకు షిర్డీ వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ సర్వీస్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2.50 గంటల్లోనే చేరుకోవచ్చని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)