Breaking News

జత్వానీ కేసులో సర్కారు జిత్తులు!

Published on Wed, 09/11/2024 - 04:04

సాక్షి, అమరావతి : అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను వేధించాలన్న రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బరితెగిస్తోంది. ఏకంగా న్యాయ­స్థానాల పరిధిలో ఉన్న అంశాల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వలపు వల (హనీట్రాప్‌)తో పారి­శ్రామికవేత్తలు, రాజకీయ నేతలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేలా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తు­న్నా­రు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీ­సులు ఇటువంటి దుందుడుకు చర్యలకు దిగుతున్నారు.

కీలక సాక్ష్యాలు సేకరించిన ఆనాటి పోలీసులు
హనీట్రాప్‌తో కాదంబరి జత్వానీ మోసాలపై 2019 ఫిబ్రవరిలో ఫిర్యాదు వచ్చింది. ఆమె తనను వేధి­స్తోందని, జగ్గయ్యపేట వద్ద ఉన్న తన 5 ఎకరాలను ఫోర్జరీ పత్రాలు సృష్టించి మరీ విక్రయించేందుకు యత్నిస్తోందని కుక్కల విద్యా­సాగర్‌ అనే పారిశ్రా­మికవేత్త ఆధారాలతో­సహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బాధ్యతా­యుతంగా స్పందించిన విజ­య­వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయ­స్థానం అనుమతితో ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్‌ చేశారు.

ఆమెను విచా­రించి కీలక ఆధారాలు సేకరించారు. జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను ముంబైలోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారంట్‌పై విజయవాడకు తీసుకువచ్చి ఇక్కడి న్యాయ­స్థానంలో హాజరుప­రిచారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో విజయవాడలోని సబ్‌ జైలుకు తరలించారు.

ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షల నిమి­త్తం న్యాయస్థానం అనుమతితో ఫోరెన్సిక్‌ లేబొరే­టరీకి పంపించారు. ఈ కేసు న్యాయస్థానంలో విచా­రణలో ఉంది. కీలక ఆధారాలైన ఫోన్లు, ఇతర ఎల­క్ట్రానిక్‌ పరికరాలు ఫోరెన్సిక్‌ లేబొరేట­రీలోనే ఉన్నాయి. 

టీడీపీ ప్రభుత్వం రాగానే..
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసును నీరుగార్చే కుట్రకు తెరలేచింది. అంతేకాదు.. ఆనాటి ఐపీఎస్‌ అధికారులపై కక్ష సాధింపునకు ఈ కేసును వక్రీకరిస్తూ టీడీపీ ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. టీడీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవ­హ­రిస్తున్న ముగ్గురు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారుల కనుసన్నల్లో ఈ కుట్రను అమలు చేశారు. కాదంబరి జత్వానీతో ఆనాటి ఐపీఎస్‌ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. 

అనంతరం ఆమె విజయవాడ వచ్చి గతంలో పోలీసులు స్వాధీ­నం చేసుకున్న తన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అప్పగించాలని కోరారు. ఆమె కోరిందే తడవుగా ప్రస్తుత విజయవాడ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారు. ఫోరెన్సిక్‌ లేబొరే­టరీలో ఉన్న ఆమె ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరా­లను విజయవాడ తెచ్చేశారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో  కీలక ఆధారాలు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలన్న ఆలోచన కూడా పోలీసులు చేయలేదు.

దీనిపై కిందిస్థాయి పోలీసు అధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో వాటిని ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. కొద్ది రోజుల్లోనే వాటిని జత్వానీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా పోలీసులను కట్టడి చేయాలని ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్‌ న్యాయ­స్థానాన్ని ఆశ్రయించారు. 

కీలక ఆధారాలు ధ్వంసం చేసే కుట్రే!
కాదంబరి జత్వానీ కుట్ర, మోసానికి సంబంధించిన కీలక ఆధా­రాలను ధ్వంసం చేసేందుకే విజయ­వాడ పోలీసులు ఆమె ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరా­లను ఆమెకు అప్పగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కేసులో కీలక ఆధారాలను నిందితులకు, మరెవ్వరికీ కూడా అప్పగించకూడదు. కేసు ముగిసేవరకు వాటిని ఫోరెన్సిక్‌ లేబొరేటరీ లేదా పోలీసులు లేదా న్యాయస్థానం ఆధీనంలోనే ఉంచాలి. కానీ జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరి­కరాలను ఆమెకు అప్పగించేందుకు నిర్ణయించడం గమనార్హం. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)