Breaking News

ఎన్‌ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయి

Published on Mon, 04/17/2023 - 16:19

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తులో చాలా లోపాలున్నాయని సీఎం జగన్‌ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం ఎన్‌ఐఏ కోర్టుకు నివేదించారు. ఎన్‌ఐఏ సరైన దిశలో దర్యాప్తు చేయలేదని.. అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్న­లుగా మిగిల్చిందని ఆరోపించారు.

దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిందన్నారు. చార్జిషీట్‌ను కూడా చాలా హడావుడిగా దాఖలు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందన్నారు. అయితే ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ మాత్రం ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. అందుకే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టుకు నివేదించారు.

ఎంట్రీ పాస్‌ లేకుండానే విమానాశ్రయంలోకి నిందితుడు.. 
వైఎస్‌ జగన్‌పై అక్టోబర్‌ 25, 2018లో హత్యాయత్నం జరిగిందని.. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆ మరుసటి రోజు శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్‌ అధికారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్‌ ఎంట్రీ పాస్‌ (ఏఈపీ)ని స్వాధీనం చేసుకున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన రోజు ఎలాంటి ఎంట్రీ పాస్‌ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లారని చెప్పారు. పాస్‌ ఇంటిలోనే ఉన్నప్పుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు.

నిందితుడు కత్తిని లోపలకు ఎలా తీసుకెళ్లాడు? 
జగన్‌తో కలిసి నిందితుడు ఫొటో దిగినట్లు ఉన్న ఫ్లెక్సీని కూడా సిట్‌ అధికారులు స్వా«దీనం చేసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అసలు ఈ ఫ్లెక్సీని ఎవరు తయారు చేశారు? ఏ ఉద్దేశంతో తయా­రు చేశారన్న వివరాలను ఎన్‌ఐఏ పట్టించుకోలేదని కోర్టుకు నివేదించారు. ఫెక్ల్సీ విషయంలో నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు ఇచి్చన వాంగ్మూలాన్ని సిట్, ఎన్‌ఐఏ రికార్డు చేశాయన్నారు. అయితే ఈ రెండు వాంగ్మూలాలకు వైరుధ్యం ఉందన్నారు. ఇందులో ఏది నిజమో తేల్చాల్సిన బాధ్యత ఎన్‌ఐఏపై ఉందని కోర్టుకు నివేదించారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని గుర్తు చేశారు.

లోపల ఉన్న హోటల్‌లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. మరి శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోపలికి వెళ్లారో ఎన్‌ఐఏ చెప్పడం లేదన్నారు. ఈ విష­యంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్‌ఐఏ విచారించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్‌ హోటల్‌లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీని­వాç­Ü­రావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్‌ తీసుకున్నారన్నారు.

దీన్ని ఆ హోటల్‌ యజమాని హర్షవర్ధన్‌ కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు. హర్షవర్ధన్‌ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచచిందన్నారు. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్‌ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్‌ఐఏ సరిగా విశ్లేషించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ వాదనలు వినిపించేందుకు ఎన్‌ఐఏ తరఫు న్యాయ­వాది సిద్ధిరాములు గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)