Breaking News

నడిరోడ్డుపై దుశ్శాసన పర్వం

Published on Tue, 09/16/2025 - 09:30

లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళ మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. మహిళ మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్‌తో నిరసన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళన కారులు పట్టు వీడటం లేదు.  

అసలేం జరిగిందంటే.. 
గిరిపురానికి చెందిన గోపీచంద్, మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఒకచోట మాట్లాడుకుంటుండగా, అమ్మాయికి సమీప బంధువు అయిన దానియేలు(హిజ్రా) వారిని చూశాడు. అనంతరం యువకుడు గోపిని పిలిచి దానియేలు మందలించే ప్రయత్నం చేయగా, అతడు తిరగబడి కొట్టాడు. దానిని మనస్సులో పెట్టుకున్న దానియేలు ఈ నెల 11న మరో నలుగురు హిజ్రాలను తీసుకుని గోపిచంద్‌ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గోపిచంద్‌తో పాటు, తండ్రి కుమార్‌బాబు, తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో మరింత మంది హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు  చించేసి దాడి చేశారు.  

మనస్తాపంతో ఆత్మహత్య.. 
హిజ్రాలు తన బట్టలు చించేసి రోడ్డుపై కొట్టడంతో కుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స  పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబ సభ్యులకు  అప్పగించారు. 

క్షమాపణలు చెప్పాలని ఆందోళన.. 
మహిళపై దాడి చేసి, మృతికి కారణమైన హిజ్రాలను తీసుకొచ్చి, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని డిమాండ్‌ చేస్తూ గిరిపురానికి చెందిన దాదాపు వెయ్యి మంది రోడ్డుపై బైఠాయించారు. డీసీపీ కె.జి.వి.సరిత, ఏసీపీ దామోదర్‌తో పాటు, సీపీ ప్రకాష్‌ వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హిజ్రాలు స్టేషన్‌లో ఉన్నారని, అక్కడకు రావాలని చెప్పినా వినడం లేదు. అంతేకాకుండా వారిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా మహిళ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ విజయవాడ సెంట్రల్‌ నియోజకవ్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్‌ కుక్కల అనిత వచ్చి సమస్య తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)