Breaking News

హజ్‌ యాత్రికులకు కూటమి సర్కార్‌ ద్రోహం

Published on Fri, 03/21/2025 - 05:38

రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లే ముస్లింల సౌకర్యార్థం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టుదలతో సాధించిన ఎంబార్కేషన్‌ 
పాయింట్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేయించింది. విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ రద్దుకు వీలుగా ఏకంగా ఏపీ హజ్‌ కమిటీతో లేఖ రాయించింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరూప్‌ బర్మన్‌ ఈ నెల 18న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలోక్‌సింగ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.   – సాక్షి, అమరావతి 

వైఎస్‌ జగన్‌ కృషితో సాకారం..
భారత్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారి కోసం ఆయా రాష్ట్రాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్‌ పాయింట్‌కు కేంద్ర పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, మైనార్టీ తదితర శాఖలు సమీక్షించి అను­మతి ఇస్తాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే వరకు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హాజీలు వెళ్లేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం ప్రత్యేకంగా దృష్టి సారించి.. విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి ఎంబార్కేషన్‌ పాయింట్‌ కోసం అనుమతి సాధించింది. 

అలాగే ఇక్కడి నుంచి ప్రయాణించే వారిపై పడిన అదనపు చార్జీలను సైతం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ భరించింది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన, కేంద్ర హజ్‌ కమిటీలతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనేక పర్యాయాలు సంప్రదించారు. కేంద్రానికి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో లేఖ కూడా రాసి ప్రతినిధి బృందాన్ని పంపించి మాట్లాడించారు. 

అయినా సానుకూల ఫలితం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై రూ.80 వేల చొప్పున పడుతున్న అదనపు చార్జీల భారాన్ని అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్‌సీపీ హయాంలో గత రెండేళ్లలో ఏకంగా 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్‌ పా­యింట్‌ నుంచి హజ్‌కు వెళ్లారు.   1,813 మందికి చార్జీల భారం లేకుండా రూ.14.50 కోట్లకు పైగా అందించింది.

ముస్లిం సమాజాన్ని మోసం చేశారు 
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వక్ఫ్‌ సవరణ బిల్లు వంటి వాటిలో టీడీపీ డబుల్‌ గేమ్‌ ఆడింది. తాజాగా ఎంబార్కేషన్‌ పాయింట్‌ పోయేలా లేఖ ఇప్పించి.. ముస్లిం సమాజాన్ని మోసం చేసింది. ఇది ముమ్మాటికి ముస్లింలను అవమానపర్చడమే. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి ఎంబార్కేషన్‌ పాయింట్‌ను తిరిగి సాధించాలి.  – షేక్‌ మునీర్‌ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్‌ 

ఇది చంద్రబాబు మార్క్‌ కుట్ర.. 
హజ్‌ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ రద్దు కచ్చితంగా చంద్రబాబు మార్క్‌ కుట్ర. ఏపీకి చెందిన ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. ఎంబార్కేషన్‌ పాయింట్‌ రద్దు చేస్తుంటే ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఏం చేస్తున్నట్లు? రూ.లక్ష హామీని ఎగవేసేందుకే ఇలా కుట్ర చేశారా? – షేక్‌ నాగుల్‌ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు 

జగన్‌ తీసుకువస్తే.. బాబు నాశనం చేశారు 
పొరుగు రాష్ట్రాల్లో ఏపీకి చెందిన హాజీలు అవస్థలు పడకూడదని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌.. పట్టుదలతో ఎంబార్కేషన్‌ పాయింట్‌ సాధించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో విమాన టికెట్‌ ధరలు ఎక్కువగా 
ఉంటే ఆ భారాన్ని కూడా భరించారు. అలాంటి సౌలభ్యాన్ని చంద్రబాబు నాశనం చేశారు.  – దస్తగిరి, ముస్లిం దూదేకుల జేఏసీ చైర్మన్‌ 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)