Breaking News

వ్యాపారులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి

Published on Sun, 04/07/2024 - 04:18

గాం«దీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/కడప కల్చరల్‌/తణుకు అర్బన్‌: కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ రావులపాలెంలో వర్తక వ్యాపారులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు, ఇతర వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఖండించగా, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చింతకుంట పుల్లయ్య మండిపడ్డారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కె.విద్యాధరరావు మీడియాతో మాట్లాడారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, కిరాణా వ్యాపారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బాబు వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. ఎక్కడైనా కిరాణా దుకాణంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా అని ప్రశి్నంచారు. ఎక్కడో గంజాయి దొరికితే వ్యాపారులకు దాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులను అవమానించడం బాబుకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారని మండిపడ్డారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ బాబు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన తీరును ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమావేశంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు ఈమని దామోదర్‌రావు, మద్దాల సుధాకర్,  శేగు వెంకటేశ్వర్లు, పోకూరి రమేశ్, ఎస్‌.వెంకటేశ్వరరావు, నాళం నాగేశ్వరరావు, మద్ది బాలు  పాల్గొన్నారు. 

వైశ్యుల ఆత్మగౌరవాన్ని కించపరచకండి 
కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కడప నగర ఆర్యవైశ్య ప్రముఖుడు, రాష్ట్ర  ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చింతకుంట పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  వైశ్యుల  ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. తక్షణమే ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు రూపంలో తమ సమాధానం చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మధ్యాహ్నం గంటపాటు కిరాణా దుకాణాలను మూసివేశారు.  

అంత చులకనా?: కారుమూరి 
కిరాణా వ్యాపారులను గంజాయి అమ్మకందారులుగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు దుర్మార్గుడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం బహిరంగ సభలో చంద్రబాబు కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ వ్యాపారులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.  అధికారంలో ఉండగా ఎస్సీలు, బీసీలపై, ఈ మధ్య టిప్పర్‌ డ్రైవర్‌కి ఎమ్మెల్యే సీటా? అంటూ అవహేళన చేసి, తాజాగా ఆర్యవైశ్యులపై వ్యాఖ్యలు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే పేద వర్గాలను టార్గెట్‌ చేస్తున్నట్టుగా అర్థమవుతోందన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ సేవా రాజకీయాలు మాత్రమే చేస్తారని చెప్పడానికి గర్వపడుతున్నానని కారుమూరి అన్నారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)