Breaking News

మా గూడును కూల్చారు

Published on Sat, 12/06/2025 - 04:08

సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: ‘‘ఎన్నో ఏళ్లపాటు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాల్జేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. ఇళ్లలోని సామగ్రి మొత్తం నష్టపోయి మూడు రోజులుగా భార్యాబిడ్డలతో టెంట్ల కింద ఉంటు­న్నాం. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మాట సాయం చేసిన పాపాన పోలేదు. మాకు మీరే న్యాయం చేయాలి. మా జీవితాలను నిలబెట్టాలి’’ అని వైస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను విజయవాడ భవానీపురం జోజినగర్‌లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు వేడుకున్నారు. శుక్రవారం ఉదయం 42 ప్లాట్ల యజమానులు ఆయనను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.

ప్రభు­త్వం నుంచి తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ‘‘మేం 23 ఏళ్ల క్రితం భవానీపురం జోజినగర్‌ వద్ద అబ్దుల్‌ మజీద్‌ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నాం. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం. కానీ, మా స్థలాలు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్‌ సొసైటీకి చెందినవని, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. మమ్మల్ని కిరాయి గూండాలతో వచ్చి అనేకసార్లు బెదిరించారు. పోలీసులను కలిశాం. చాలామంది నాయకులకు చెప్పినా న్యాయం జరగలేదు.   

కోర్టు ఉత్తర్వులున్నా వినలేదు... 
మా విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు ఉపక్రమించవద్దని గత నెల 3న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 3వ తేదీన బుధవారం 300 మందిపైగా పోలీసులు, శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్‌ సొసైటీ వారు ఆరు జేసీబీలతో వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తాయని, కాళ్లావేళ్ల్ల ప్రాథేయపడి నాలుగు గంటల సమయం కోరినా కనీసం మానవత్వం చూపలేదు. వందలాది పోలీసులతో వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇంట్లో సామాన్లను కూడా బయటికి తెచ్చుకోనివ్వలేదు.

పిల్లలకు పాలు, మంచినీళ్లు అందించే అవకాశం ఇవ్వకుండా మా ఇళ్లను మా కళ్లముందే కూల్చివేశారు. చర్చిని అయినా కూల్చొద్దని ప్రాథేయపడ్డాం. కానీ, మాకెవరు అడ్డు వస్తారో చూస్తామంటూపడగొట్టారు. డిసెంబరు 31 వరకు 42 ప్లాట్లపై చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పూర్తి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపాక పోలీసులు వెళ్లిపోయారు. అప్పటికే అంతా అయిపోయింది’’ అని వాపోయారు. ప్లాట్ల యజమానులు వైఎస్‌ జగన్‌ను కలిసిన సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, వెలంపల్లి, భాగ్యలక్షి్మ, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)