Breaking News

Vietnam: భర్త కళ్లముందే భార్య జయశ్రీ మృతి

Published on Sun, 07/12/2026 - 09:57

మచిలీపట్నంటౌన్‌:  వియత్నాం దేశంలోని ఫు క్వాక్‌ సముద్ర తీరంలో శనివారం ఉదయం జరిగిన ఘోర పర్యాటక బోటు ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్‌ భార్య మరణించింది. కిషోర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆయనకు సీపీఆర్‌ చేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మచిలీపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లావా సెల్‌ కంపెనీ తమ వ్యాపార భాగస్వాములు, డీలర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనలో భాగంగా గెల్లి దంపతులు వియత్నాం టూర్‌కు వెళ్లారు.

మూడు రోజుల క్రితం ఈ టూర్‌కు వెళ్లారు. వీరు శనివారం వియత్నాంలోని ఫు క్వాక్‌ ప్రాంతంలో ఆన్‌ థోయ్‌ ద్వీప సమూహం సమీపంలోని హోన్‌ మే రుట్‌ వద్ద పర్యాటకులతో కలసి స్పీడ్‌బోట్‌లో విహారయాత్రకు బయలుదేరారు. సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో బలమైన గాలులు, ఎత్తైన కెరటాల ధాటికి బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న పలువురు నీటిలో చిక్కుకోగా, సహాయక బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన యాత్రికులు సహా మొత్తం 32 మంది మృతి చెందినట్లు వియత్నాం ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.

మృతుల్లో మచిలీపట్నానికి చెందిన గెల్లి జయశ్రీ ఉన్నారు. స్ధానిక సర్కిల్‌పేటలోని కంచి కామాక్షమ్మ ఆలయ సమీపంలో సాయిబాబా గుడి పక్కన నివాసముండే గెల్లి కిషోర్‌ భార్య జయశ్రీ మృతితో గెల్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే స్థానిక వ్యాపార వర్గాలు దిగ్భ్రాంతి చెందాయి. గెల్లి కిషోర్‌ మచిలీపట్నంలో కిళ్లీ సామగ్రి దుకాణంతో పాటు లావా, టాటా ఇండికాం, టాటా సెల్యులర్‌ డీలర్‌గా గత 30 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు.   

కలెక్టర్‌ను సంప్రదించిన కిషోర్‌ కుమారుడు ఆకాష్‌ 
వియత్నాంలో పడవ ప్రమాదంలో మృతి చెందిన తన తల్లి జయశ్రీ మృతదేహంతో పాటు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ తండ్రి కిషోర్‌ను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆకాష్‌ జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీని కోరారు. కృష్ణాజిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కూడా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయటంతో స్పందించిన కలెక్టర్‌ ఎంబసీ అధికారులతో మాట్లాడి జయశ్రీ మృతదేహం త్వరితగతిన మచిలీపట్నంకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనపై మచిలీపట్నంలోని ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)