ఐదు వైద్య కళాశాలల్లో అన్ని పోస్టులు భర్తీ చేయండి

Published on Sat, 12/09/2023 - 06:09

సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న ఐదు వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించేలా చ ర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాల­యంలో శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమా వేశంలో ఐదు వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీపై మంత్రి సమీక్షించారు.

ఆమె మాట్లాడుతూ బోధనా సి బ్బందిని కాంట్రాక్టు విధానంలో నియమించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు వేతనాలు ఇవ్వడం, అదేవిధంగా శాశ్వత బోధనా సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించేందుకు సాధ్యా సా«­ద్యాలను పరిశీలించాల న్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్ప డం ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేస్తున్నారని చెప్పారు.

 ఐదు కళాశాలలను ప్రారంభించామని, ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, వైద్య విద్యార్థుల హాజరు ఉండేలా పర్య వేక్షించాలని సూచించారు. వైజాగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌) బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖలో ఇప్పటి వరకు 53వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్టు గుర్తుచేశారు. వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కా ర్యదర్శి డాక్టర్‌ మంజుల, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్, వై ఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ వెంకటేశ్వర్, డీ ఎంఈ డాక్టర్‌ నరసింహం తదితరులు పాల్గొన్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)