Breaking News

ఆలయానికి అన్యాయం.. అర్చకుడిపై దౌర్జన్యం

Published on Tue, 12/16/2025 - 04:34

శింగనమల/అనంతపురం అర్బన్‌: అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని శ్రీదుర్గాంజనేయ స్వామి ఆలయానికి, కమ్యూనిటీ భవనానికి టీడీపీ నాయకులు తాళాలు వేశారు. సోమవారం దౌర్జన్యంగా పాత తాళాలను పగలగొట్టి వారు వెంట తెచ్చుకున్నవి వేసుకున్నారు. ఈ ఆలయానికి సంబంధించి రెండునెలల క్రితం టీడీపీ మూకలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పాత కమిటీని తొలగించారు. కొత్తగా టీడీపీ నాయకులే కమిటీ వేసుకున్నారు. తరువాత ఆలయ అర్చకుడు సిరి రమణను తొలగించాలని, అక్కడి నుంచి బయటకు పంపించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే అర్చకుడి కుటుంబంపై నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన కొంతమంది సోమవారం ఆలయం వద్దకు చేరుకుని హల్‌చల్‌ చేశారు. వారి ఆగడాలు శృతిమించడంతో అర్చకుడు రమణ జిల్లా కలెక్టరేటులో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆయన తండ్రి ఒక్కరే ఆలయం వద్ద ఉన్నారు. దీంతో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆలయానికి, కమ్యూనిటీ భవనానికి సొంత తాళాలు వేసుకున్నారు. అర్చకులు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు.  

కలెక్టరేట్‌ ఎదుట అర్చకుడి దీక్ష 
‘వంశపారంపర్యంగా మా ముత్తాతల కాలం నుంచి దాదాపు 150 ఏళ్లుగా శ్రీదుర్గాంజనేయస్వామి దేవస్థానంలో అర్చకత్వం చేస్తున్నాం. ఇప్పడు కొందరు వ్యక్తులు వచ్చి దేవస్థానం విడిచి వెళ్లాలంటూ దాడులు చేస్తున్నారు. పోలీసులకు, ఎంపీడీఓకి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అంటూ దేవస్థానం ప్రధాన అర్చకుడు బీఈ సిరి రమణ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఫుట్‌పాత్‌పై కూర్చుని దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవాలయానికి ఆదాయం లేకున్నా సొంత ఖర్చుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 25 ఆవులనూ సొంత ఖర్చు, భక్తుల కానుకలతో పోషిస్తున్నాం. అయినా దేవస్థానం విడిచివెళ్లాలని మాపై కొందరు ఏడాది కాలంగా దౌర్జన్యం చేస్తున్నారు. భౌతిక దాడికి ప్రయతి్నస్తున్నారు. శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. పైగా..  నాపైనే తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ గొడవకు ఐదుగురు వ్యక్తులు కారణం. అందులో ఒక విలేకరి (సాక్షి కాదు), రిటైర్డు తహసీల్దారు కూడా ఉన్నారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు కలెక్టరేట్‌ వద్దనే కూర్చుని నిరాహార దీక్ష చేస్తా’నని ఆయన చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)