Breaking News

Tirupati Stampede: మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది..

Published on Wed, 01/15/2025 - 12:24

వైకుంఠ ద్వారం నుంచి ఆ కలియుగ వేంకటేశ్వరస్వామివారిని దర్శించి పునీతులు కావాలని తరలివచ్చారు. కానీ అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. వారి జ్ఞాపకాలు తలుచుకుని బంధువులు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు.

తిరుపతి టాస్క్‌ఫోర్స్‌: వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్లే సమాధానం చెబుతున్నాయి. తోడుగా ఉన్నవారు దూరమవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తల్లిలేని ఆడ బిడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోలేక పోతున్నామని, ఆ జ్ఞాపకాలు తలుచుకుని మంచానికే పరిమితమయ్యామని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. 

వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం కౌంటర్లలో ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెల్సిందే. అందులో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందిన భక్తులు ఉన్నారు. ఘటన జరిగి సుమారు ఆరు రోజులు కావస్తున్నా మరణించిన భక్తుల రక్తసంబంధీకులు, బంధువులు ఆ షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కొందరు మంచానికే పరిమితమయ్యామని, జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

  • వైజాగ్‌కు చెందిన మృతురాలు లావణ్య కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి దూరమైన ఆ పసిపాపల ఆవేదన వర్ణ నాతీతం. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన చెందుతున్న ఆ పిల్లలను బంధువులు ఓదార్చలేని పరిస్థితి.

 

తల్లిని కోల్పోయా.. 
మాది కేరళ. ఈనెల 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మా తల్లి నిర్మల చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోలేకున్నాం. మా తల్లి నా కళ్ల ఎదుటే తి రుగుతున్నట్లు ఉంది. మా కుటుంబానికి ఆ మే పెద్ద దిక్కు. అలాంటిది తల్లి లేకపోవడం కలచివేస్తోంది. ఏ జన్మలో పాపం చేశానో త ల్లిని పోగొట్టుకున్నాను.
–కౌషిగ, మృతురాలు నిర్మల కుమార్తె, కేరళ

అమ్మ జ్ఞాపకాలతో..

ఊహించని ఘటనతో కుటుంబం అంతా షాక్‌లోనే ఉంది. దైవదర్శనానికి వెళితే ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి అమ్మతో కలసి సంతోషంగా గడుపుకున్నాం. ఇప్పుడు నాన్నతో పాటు యావత్‌ కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయి ఉన్నాం. జ్వరాలతో మంచాన పడ్డాం. 
– మహేష్‌, మృతురాలు శాంతి కుమారుడు, వైజాగ్‌

మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది  
మాది వైజాగ్‌ దగ్గర మద్దెలపాళెం. నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఒక్కడే కుమారుడు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నా భార్య రజిని మరణించింది. మా ఇంటి మహాలక్ష్మి మాకు దూరమైంది. ఇంట్లో నేను, నా కుమారుడు ఇద్దరమే మిగిలాం. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి సంతోషంగా గడిపాం. ఈ ఏడాది ఆమెను దేవుడు దూరం చేశాడు. మా అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. 
– లక్ష్మణరెడ్డి, మృతురాలి భర్త, మద్దెలపాళెం, వైజాగ్‌

ఆయన జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా.. 
వైకుంఠ వాకిలి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే తపనతో నా భర్త నాయుడుబాబుతో క లసి 8వ తేదీన తిరుపతికి వచ్చాం. అదే రోజు జరిగిన తొక్కిసలాటలో నా భర్త చనిపోయాడు. కూలి చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో ఈ విషాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నా భర్త వెంట లేడనే బాధను దిగమింగుకోలేక పోతున్నా. కుటుంబంలో 90 ఏళ్ల పెద్దవారు ఉన్నా రు. వారి బాగోగులు చూసుకోవాలి. ఆయన తోడు విడిచాడు. నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సాయం అందించింది. నేను పెద్దగా చదువుకున్న దానిని కాదు. అధికారులు ఉద్యోగం నర్సీపట్నంలోనే కల్పిస్తే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.
– మణికుమారి,మృతుడు నాయుడుబాబు సతీమణి, నర్సీపట్నం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)