Breaking News

కట్లపాము కాటు.. క్షణాల్లో ప్రాణాపాయం!

Published on Mon, 06/15/2026 - 12:57

శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో పాముకాటు మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోనే పాముకాట్లు అధికంగా ఉంటున్నాయి. ఏటా రెండు వేల మందికిపైగా పాముకాటుకు గురవుతున్నారు. అందులో 400 మంది వరకూ మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది రైతులే కావడం బాధాకరం. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములు ప్రాణాలు బలిగొంటున్నాయి. జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రతలు కూ డా ఉన్నాయి. వేడి వాతావరణాన్ని తట్టుకోలేక విష జంతువులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్తున్న వారిని కాటు వేస్తున్నాయి. అందుకే రైతులు, శ్రమజీవులు పొలాలకు వెళ్లినప్పడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

పాముకాటు వేసిన వెంట నే సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణా లు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటువైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవెలెంట్‌ యాంటీ వినమ్‌’ శాసీ్త్రయంగా నిరూపితమైన మందు. దాదాపు అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచిన ట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో చాలా ఆస్పత్రుల్లో అందుబాటులో లేవన్న విమర్శలున్నాయి. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో మాత్రం అందుబాటులో ఉంటుంది. కానీ మొదటి 5–10 డోసుల వరకూ ఉంటుంది. అటు తర్వాత జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి వెళితే ఉపశమనం దక్కుతుంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడు గంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వీనమ్‌ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లాలో 60 పీహెచ్‌సీలతోపాటు 108, 104 వాహనాల్లో యాంటీ వినమ్‌ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచితే పాముకాటు మృతులను తగ్గించవచ్చు.
 

కొన్ని ఘటన

●ఈ నెల 10న ఎల్‌ఎన్‌పేట మండలం జాడుపేట గ్రామానికి చెందిన కరణం సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు.

●గత ఏడాది నవంబరు 10న జలుమూరు మండలం యాతపేట గ్రామానికి చెందిన వాడ సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.

●గత ఏడాది సెప్టెంబరు 11న ఎల్‌ఎన్‌పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.

●గత ఏడాది జూలైలో ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే 26 మంది పాముకాటుతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు విష నాగుల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.

ఇలా చేయాలి!
పొలాల గట్లపై నడిచేటప్పుడు కర్రతో చప్పుడు చేయడం మంచిది. రాత్రి పూట పొలానికి వెళితే కచ్చితంగా టార్చ్‌లైట్‌ వినియోగించాలి.

ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి.

పాముకాటు బాధితులకు దైర్యం చెప్పాలి. భ యంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కొందరు కాటు వేయగానే కత్తి, బ్లేడుతో గాట్లు పెడుతుంటారు. అలాంటివి చేయకూడదు.

గాయం పైభాగాన్ని వస్త్రంతో గట్టిగా కట్టి ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

ఆస్పత్రికి తీసుకెళ్లాలి

పాముకాటుకు గురైన వెంటనే ఆస్పత్రికి తరలించాలి. నాటువైద్యం పేరుతో జాప్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. ప్రభుత్వాస్పత్రు ల్లో యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి వీలైనంత త్వరగా చేరిస్తే ప్రాణాలు కాపాడగలం.

– పి.సాయికుమార్‌ వైద్యాధికారి, హిరమండలం

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)