Vennupotu Dinam: నిరసన హోరు

Published on Thu, 06/05/2025 - 08:30

జిల్లాలో వెన్నుపోటు దినాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనలతో బుధవారం జిల్లా , నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కారు. పోలీసుల బెదిరింపులు, హెచ్చరికలు, నిషేధాలు పక్కనపెట్టి హామీలు అమలు చేయాలని కార్యకర్తలు గర్జించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు జెండాలతో దండులా కదిలివచ్చింది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని నిరసనలకు కదిలివచ్చారు. ఉవ్వెత్తున కార్యకర్తలు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో నిరసన హోరుతో       దద్దరిల్లింది.

చిత్తూరు అర్బన్‌ : హామీల పేరిట ప్రజలను దగా చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టేలా వెన్నుపోటు దినం నిర్వహించారు. మండు టెండను లెక్కచేయని జగనన్న సైన్యం రోడ్డెక్కి కూటమి సర్కారు మోసాన్ని ఎండగట్టింది. వేల మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినంతో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసి హామీల అమలుపై ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది.  

∙చిత్తూరులో జరిగిన నిరసనలో సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అమూల్‌ డెయిరీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయలేదు. పార్లమెంటు పరిశీలకులు చువ్వా రాజశేఖర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్, నాయకులు కెపి.శ్రీధర్, జగదీ‹Ù, గాయత్రీదేవి, లీనారెడ్డి, సూర్యప్రకాష్‌ రెడ్డి, విజయసింహారెడ్డి, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.  

∙పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా హాజరు కావడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వెన్నుపోటు దినంలో కదంతొక్కారు. పాత బస్టాండు, పోలీస్‌ స్టేషన్, గోకుల్‌ సర్కిల్, అంబేడ్కర్‌ కూడలి వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, నాయకులు పెద్దిరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , అనూషారెడ్డి, పోకల అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు నిరసనకు దిగారు.

ఈకార్యక్రమంలో సమన్వయకర్త కృపాలక్షి్మ, మండల కనీ్వనర్లు పాల్గొన్నారు. అలాగే కుప్పంలో  ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో వెన్నుపాటు నిరసనలకు కదం తొక్కారు. ఇక  పలమనేరులో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీనివాసులుతో కలిసి పలమనేరు సెంటర్‌లో వెన్నుపోటు  నిరసన కార్యక్రమం హోరెత్తించారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, పార్టీ నేతలు కుమార్‌రాజా, ధనంజయరెడ్డి, బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మోసమే బాబు నైజం 
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసగించడం చంద్రబాబు నైజం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగభృతి, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడాది అవుతున్నా ఇచ్చిన దాఖలాలు లేవు.                    
– రాజశేఖర్‌రెడ్డి, 
చిత్తూరు పార్లమెంట్‌ పరిశీలకులు  

ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభం 
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా ఏడాది పండుగ నిర్వహిస్తోంది.  ప్రజల్లో ఏడాది తిరగకుండానే తిరుగుబాటు మొదలయింది.  నాణ్యమైన మద్యం, తక్కువ ధరలకు అందిస్తామని ఎరగా చూపి చంద్రబాబు ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అంతా మద్యం కుంభకోణమే నడుస్తోంది. కూటమి పాలనకు తెరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.  
– నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి  

ప్రజలు నిలదీసే రోజులు వస్తాయి  
30 యాక్టు అమల్లో ఉందని, కేసులు పెడతామనే బెదిరింపులు, పోలీసుల హెచ్చరికలను కార్యకర్తలు లెక్కచేయలేదు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి. హామీల నుంచి పాలకులు తప్పించుకోలేరు. ప్రజలే నిలదీసే రోజులు త్వరలో వస్తాయి.   – భరత్‌ , ఎమ్మెల్సీ, కుప్పం  

అప్పులు తీసుకురావడమే సంపద సృష్టా? 
సంపద సృష్టించడమంటే ప్రతి మంగళవారం అప్పు లు తీసుకురావడమేనా..?   పోలీసులు 110 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా ..వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. గతంలో గగ్గోలు పెట్టిన పెద్దలు ఇప్పుడు అప్పులు చేయడం దేనికో ప్రజలకు చెప్పాలి. ఏడాదిలో ఒక్క హామీ అమలు చేయలేదు. 
– వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే పలమనేరు


 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)