Breaking News

బాబు నిర్లక్ష్యం వల్లే ముంపు వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

Published on Mon, 09/02/2024 - 05:30

సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే విజయవాడ నగరం ఎప్పుడూలేని విధంగా ముంపునకు గురైందని వైఎస్సార్‌సీపీ నేతలు మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంవల్ల రాష్ట్రంతోపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కృష్ణా, ఉప నదులకు భారీ ఎత్తున వరద వచ్చే అవకాశముందని ఐఎండీ, సీడబ్ల్యూసీ ముందస్తుగా హెచ్చరించినా.. ముంపు ముప్పు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు.

ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తేయడంవల్లే విజయవాడ ముంపునకు గురైందని ఫైర్‌ అయ్యారు. జలదిగ్బంధంలో చిక్కుకుని సహాయం కోసం ప్రజలు అర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్‌ ఎంజాయ్‌మెంట్‌లో బిజీగా ఉన్నారా? అని వారు ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో.. బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే ముందుండి చేస్తున్నారని చెప్పారు.

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. వారు ఇంకా ఏమన్నారంటే.. నిన్న కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. వారిని పరామర్శించిన వారులేరు. కరెంట్‌ లేదు.. నిత్యావసర వస్తువుల్లేవు.. ఇదేనా పాలన? విజయవాడ నగరంలో మీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజలు మాకు ఫోన్లుచేసి సాయం కోరుతున్నారు. మేమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. అధికార్లు కూడా మా ఫోన్లు ఎత్తడంలేదు. గతంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థ  ఉంటే ముందే ప్రజలను అప్రమత్తం చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థల్లేవు.  కూటమి ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా మేం ప్రజల తరఫున పోరాటం చేస్తాం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)