Breaking News

ఆర్టీవో ఆఫీసులో దసరా, దీపావళి దందా..!

Published on Tue, 10/29/2024 - 10:26

సాక్షి,విశాఖపట్నం: విశాఖ ఆర్టీవో  కార్యాలయంలో దసరా,దీపావళి దందాకు తెరతీశారు. రెండు నెలల నుంచి వేల సంఖ్యలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు పెండింగ్‌ పెట్టారు. ఉద్దేశ్య పూర్వకంగానే రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్‌ల పెండింగ్‌కు ఏదో ఒక సాకు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు.రిజిస్ట్రేషన్ జరగాలంటే 500 నుంచి 1000 వరకు చేతులు తపాలని ఆర్టీఏ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పని జరగాలంటే తమ డ్రైవర్లను కలవాలని కొందరు అధికారులు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.

డ్రైవర్‌లతో వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడాలని ఆ అధికారులు సూచిస్తున్నారు. తమ డ్రైవర్లకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ రవాణా కమిషనర్‌(డీటీసీ)కి తెలియకుండా కిందిస్థాయి సిబ్బందే ఈ దందా నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంతో విసిగిపోయిన టూ వీలర్‌,ఫోర్‌ వీలర్‌ వాహనాల డీలర్లు డీటీసీని మంగళవారం(అక్టోబర్‌ 29) కలవనున్నారు. గంభీరం నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన అధికారి,మరో మహిళా అధికారితో కలిసి ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ ఆర్టీవో ఆఫీస్ లో దసరా, దీపావళి దందా

ఇదీ చదవండి: బాంబు బెదిరింపులతో హడల్‌ 

 

 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)