Breaking News

మహిళా కమిషన్‌ను పవన్‌ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ

Published on Fri, 07/14/2023 - 16:55

సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయంలో శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై చర్చించారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయ మహిళా ఉద్యోగుల సూచనలను మహిళా కమిషన్‌ తీసుకుంది. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సెక్రెటరియేట్‌లోని మహిళా అధికారులు, ఉద్యోగిణీలు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినం జరుపుకుందామని తెలిపారు. మహిళలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, మహిళలను గౌరవించలేని సమాజం అభివృద్ధి సాధించలేదని అన్నారు.  మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి పథకాన్ని మహిళల పేరు మీదనే అమలు చేస్తున్నారన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం దిశా యాప్ తీసుకవచ్చిందని తెలిపారు.

పవన్‌కు మహిళా కమిషన్‌ను గౌరవించడంలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మహిళా కమిషన్‌ నోటీసులను ఆయన లైట్‌ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వాలంటీర్లపై దారుణమైన ఆరోపణలు చేశారు కనుకే ఆధారాలు చూపమన్నామని, వితంతువులు, ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు.  ఒకరిద్దరు తప్పు చేస్తే వ్యవస్థను రద్దు చేయాలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. తమ పైనా జనసేన కార్యకర్తలు ట్రోల్‌ చేస్తున్నారని, మరి మీ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.  ఇందుకు పవన్ కళ్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా అని నిలదీశారు.

చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం 


 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)