Breaking News

డీజీపీ బాధితుల పక్షమా?.. దాడి చేసినవారి పక్షమా?

Published on Fri, 06/13/2025 - 05:09

సాక్షి, అమరావతి: రాష్ట్ర డీజీపీ బాధితుల పక్షాన ఉంటారో, దాడులు చేసిన చేసిన వారి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ­లు అరుణ్‌కుమార్, వరుదు కళ్యాణి, ఇతర నేతలు స్పష్టంచేశారు. ఏపీలో అరాచక పరిస్థితులపై డీజీపీకి ఫిర్యా­దు చేయటానికి వస్తే కనీసం అపా­యింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు, పొదిలిలో రైతులపై అక్రమ కేసులు, శాంతిభద్రతల పరి­రక్షణలో ప్రభుత్వ వైఫల్యం,   మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కార్యక్రమాలకు భద్రత కల్పించకపోవడం, మహిళలపై అఘాయిత్యా­లు తదితర అంశాలపై వారు గురువా­రం అదనపు డీజీ మధుసూదనరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం  ఎమ్మె­ల్యే చంద్ర­శేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా డీజీపీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. అదనపు డీజీకి చాలా అంశాలపై ఫిర్యాదు చేశాం. దర్శిలో మా వారిపై టీడీపీ గూండాలు దాడి చేస్తే, మా వారిపైనే 15 అక్రమ కేసులు పెట్టారు. బాధితులకు కాకు­ండా టీడీపీ గూండాలకే పోలీ­సులు రక్షణ కల్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడైన వైఎస్‌ జగన్‌ పర్యటనలకి ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించడంలేదు. జగన్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసిన వారికి పోలీసులు అండగా నిలబడ్డారు.

పొదిలి, గుంటూరు, రామగిరి, తెనాలి ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటనలో ప్రజలు భారీగా వచ్చినా, తగిన భద్రత కల్పించలేదు. ఇందులో లోకేశ్, టీడీపీ పాత్రపై విచారణ చేయాలి. జగన్‌ పర్యటనను అడ్డుకొనేందుకు వచ్చిన 40 మంది టీడీపీ మహిళా కార్యకర్తలకు మాత్రం 200 మంది పోలీసులను రక్షణగా పెట్టారు. మహిళలను ముందర పెట్టి విధ్వంసాలు సృష్టించి, జగన్‌ ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ కుట్ర చేస్తోంది.

ఇవే విషయాలను అడిషనల్‌ డీజీకి వివరించాం. వైఎస్సార్‌సీపీ వారిపై కొందరు పోలీసులు చేస్తున్న దాడులపైనా చర్యలు తీసుకోవాలని కోరాం’ అని చెప్పా­రు. వైఎస్‌ జగన్‌ పర్యటనలకు భద్రత విష­యంలో ఎవరు ఆదేశిస్తే ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో పోలీసు అధికారులే చె­ప్పా­లని అరుణ్‌ కుమార్‌ అన్నారు. అడిషనల్‌ డీజీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పి­రెడ్డి,  నాయకులు మలసాని మనోహర్‌ రెడ్డి, ఏఎన్‌ఎన్‌ మూర్తి తదితరులు ఉన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)