Breaking News

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్‌?

Published on Mon, 11/17/2025 - 05:03

గాందీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది త్వరలో ప్రకటిస్తానని దివంగత ఎమ్మె­ల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్‌ చెప్పారు. ఆదివారం పాలకొల్లులో కార్తీక వన సమారాధనలో పాల్గొనేందుకు పయనమైన ఆమె.. తొలుత విజయ­వాడలోని తమ ఇంటి ఎదుట వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఈ రోజు నుంచే ప్రజా జీవితం ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ‘ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరికైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా ఉంటా’ అని స్ప­ష్టం చేశారు. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కొంత కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నా­నని, రాధా ర­ంగా మిత్ర మండలితో కొంత గ్యాప్‌ ఏర్ప­డిందని చెప్పా­రు.

ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు తాను ప్రజా జీవితంలోకి వ­స్తు­న్నానని తెలిపారు. తన అన్న వంగవీటి రాధాకృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవని, ఇద్దరిదీ రంగా ఆశయ సాధనే లక్ష్యమన్నారు. ఇక­పై రాధా రంగా మిత్ర మండలి, రంగా ఫ్యాన్స్‌­తో కలుస్తానని, అన్ని అంశాలు చర్చిస్తానన్నారు. పబ్లిక్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. రా­జ­కీయ ఆరంగేట్రంపై తర్వాత స్పందిస్తానని చెప్పా­రు. ప్రస్తుతం రాజకీయాల కోసం రాలేదని, సం­దర్భం వచ్చినప్పుడు అందరి సమక్షంలో తన నిర్ణ­యా­న్ని ప్రకటిస్తానని తెలిపారు. అనంతరం ఆమె రాధా రంగా మిత్ర మండలితో కలిసి కార్తీక వన సమారాధన­లో పాల్గొనేందుకు పాలకొల్లు బయలుదేరి వెళ్లారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)