Breaking News

విశాఖలో ‘లూలూ’కి 13.43 ఎకరాలు

Published on Thu, 03/27/2025 - 05:09

సాక్షి, అమరావతి: విశాఖ నడిబొడ్డున ఉన్న 13.43 ఎకరాల విలువైన హార్బర్‌ పార్కు భూములను లూలూ గ్రూపునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ సంస్థ రద్దుచేసుకున్న ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను తిరిగి ప్రారంభించడానికి  సీఎం అధ్యక్షతన ఇటీవల జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. 

అలాగే, భూ కేటాయింపు చేయాల్సిందిగా అధికారులను అదేశించింది. ప్రస్తుతం ఈ భూములు విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో ఉండడంతో వీటిని తిరిగి ఏపీఐఐసీకి బదలాయించాలని.. ఇందుకోసం రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌. యువరాజ్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. 

సీఎంకు ‘లూలూ’ చైర్మన్‌ లేఖ..
విశాఖలో హైపర్‌ మార్కెట్‌తో పాటు చిల్ర్డన్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్కు, ఫైన్‌ డైనింగ్‌ ఫుడ్‌ కోర్టులు, ఎనిమిది స్క్రీన్ల మల్టీప్లెక్స్, భారీస్థాయిలో కారు పార్కింగ్‌ను అభివృద్ధి చేస్తామంటూ ఈ ఏడాది జనవరి 17న లూలూ గ్రూపు చైర్మన్‌ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. గతంలో మాదిరిగానే 99 ఏళ్ల లీజుకు భూములను ఇవ్వడంతో పాటు మల్టీప్లెక్స్‌ ప్రారంభం అయ్యేవరకు లేదా మూడేళ్ల వరకు ఈ రెండింటిలో ఏది ముందయితే అంతవరకు అద్దె మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరారు. 

అదే విధంగా.. పదేళ్లకొకసారి 10 శాతం చొప్పున అద్దె పెంచుతామని, ఇవికాక  ఇతర పారిశ్రామిక రాయితీలు కూడా వర్తింపజేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలను ఎస్‌ఐపీబీ పరిశీలించి ఆమోదించింది. అలాగే, భూములను వీఎంఆర్‌డీఏ నుంచి ఏపీఐఐసీకి బదిలీ చేయాల్సిందిగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు యువరాజ్‌ పేర్కొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)