Breaking News

ఇక.. ఆలయ భూముల వంతు!

Published on Sat, 11/01/2025 - 04:58

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విలువైన భూముల్ని ఏదో ఒకరకంగా అస్మదీయులకు అప్పగిస్తున్న చంద్ర­బాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములను కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు శుక్రవారం మరో జీవో జారీచేసింది. దేవదాయ శాఖకు సంబం«ధించి పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను దీర్ఘకాలిక లీజు­కు ఇవ్వాలన్న అంశంపై సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. 

దేవదాయ­శాఖ కార్యదర్శి, కమిషనర్, చీఫ్‌ ఇంజినీరు, ఆయా భూములకు సంబంధించిన ఆలయ ఈవో లేదా దేవదాయశాఖ ప్రాంతీయ జాయింట్‌ కమిషనర్‌ ఈ కమిటీలో ఉంటారని జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో దేవదాయశాఖ పరి«ధిలో ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,67,283 ఎకరాల భూములున్నాయి. వీటిలో 4,244 ఎకరాలకుపైగా అత్యంత విలువైన భూములు పట్టణాల్లో ఉన్నాయి. ఇవి 1.55 కోట్ల చదరపు గజాల ఖాళీ భూములుగాను, 50 వేల చదరపు గజాల కట్టడాలుగాను ఉన్నాయి. అంటే మొత్తం 2.05 కోట్ల చదరపు గజాలు. 

ఈ ఏడాది మే నెలలో ఇలాంటిదే ఒక జీవో  
దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆలయ భూములను లీజుకివ్వాలంటే.. వేలం పాట నిర్వహించి, హెచ్చుపాటదారుకి నిర్ణీత మొత్తానికి ఇవ్వాలి. లీజు గడువు ముగియగానే మళ్లీ వేలం నిర్వహించాలి. దీనికి తూట్లు పొడుస్తూ 20 సంవత్సరాల పాటు లాభాపేక్ష లేకుండా సేవాకార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వ్యవసాయేతర ఆలయ భూములను బహిరంగ వేలంతో సంబంధం లేకుండానే లీజు రూపంలో ఇవ్వడం లేదా పొడిగించడానికి వీలుగా దేవదాయశాఖ నిబంధనల్లో మార్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మే 2వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. 

ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి సహా భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘దీన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వేలం విధానం లేకుండా తమకు కావాల్సినవాళ్లకు ఆలయ భూములు కట్టబెట్టడానికి ఈ ఉత్తర్వులు పనికొస్తాయి. న్యాయపరంగా కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది..’ అని అప్పట్లో ఆయా భక్తసంఘాలు సోషల్‌ మీడియా వేదికలపై పేర్కొన్నాయి. 

ఈ అంశంపై అప్పట్లో సాక్షి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌.. ప్రజల నుంచి అభ్యంతరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై పరిశీలన ప్రక్రియలోనే ఆగిపోయింది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ఆలయభూములను కూడా లీజుకిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం జీవో జారీచేయడాన్ని భక్త సమాజం తప్పుపడుతోంది. ఇలాంటి జీవోలు ప్రభుత్వం అనుకున్న వారికి నామమాత్రం ధరకు కావాల్సినంత కాలం లీజుకు ఇవ్వడానికి ఉపయోగపడతాయని, తద్వారా ఆలయాల మనుగడ ప్ర«శ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)