Breaking News

సరిహద్దు దాటుతున్న యూరియా పట్టివేత

Published on Fri, 08/29/2025 - 03:33

దాచేపల్లి: యూరియా బస్తాలు అందక ఓ వైపు అన్నదాతలు అల్లాడిపోతుంటే మరోవైపు టీడీపీ నేతలు అక్రమంగా సరిహద్దు దాటిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసు­­కుంటున్నారు. పల్నాడు జి­ల్లా దాచేపల్లి మండలం పొందుగు­ల రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 165 యూరియా బస్తాలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను కూడా సీజ్‌ చేశారు. 

యూరియా అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా గుంటూరు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, దాచేపల్లి పోలీసులు, వ్యవసాయ అధికారి సంయుక్తంగా పొందుగల చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనా­­ల తనిఖీ చేపట్టారు. దాచేపల్లి మండలం నుంచి రెండు వాహనాల్లో అక్రమంగా త­­రలిస్తున్న రూ.43,972 విలువ చేసే 165 బస్తాల యూరియాని పట్టుకున్నారు. 

కారంపూడిలోని నీరజ లక్ష్మీ వెంకట సత్యనారాయణ కమర్షియల్‌ షాపులో కొను­గోలు చేసి, స్థానిక రైతుల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి తెలంగాణకు తరలిస్తున్నట్టు గు­ర్తించారు. టీడీపీ నేతలు సకినాల సురేష్, బొలగన సుధీర్, యూరియా కొనుగోలు­కు సహకరించిన నంద్యాల నాగరాజు, నీరజ లక్ష్మీ వెంకట సత్యనారాయణ కమర్షియల్‌ షాపు యజమాని ఆతుకూరి నరసింహరావులపై కేసు నమోదు చే­శా­రు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)