Breaking News

ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు

Published on Sat, 05/24/2025 - 08:36

సాక్షి, చెన్నై: 2004లో సునామీ సృష్టించిన విలయతాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్‌ అధికారిగా గగన్‌దీప్‌సింగ్‌ బేడీ పనితీరును చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్‌ కనులార చూశారు. సునామీ విలయం నుంచి బయటపడిన జీడి పప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్‌ కావాలన్న కలతో ముందుకు సాగారు. ఇందులో ఒకరు ఐఏఎస్‌గా, మరొకరు ఐపీఎస్‌గా విధుల్లో చేరి రాణిస్తున్నారు.  

కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని మరుంగూర్‌ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుస్మిత, ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏడాదిన్నర వయస్సు తేడా. 2004లో జరిగిన సునామీ తాండవం సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సీనియర్‌ ఐఏఎస్‌గా ఉన్న గగన్‌దీప్‌సింగ్‌ బేడి అప్పట్లో కడలూరులో వీరోచితంగా సేవలు అందించడంలో శ్రమించారు. దీనిని చిన్న పిల్లలుగా ఉన్న సుస్మిత, ఐశ్వర్య చూసి, తాము సైతం ఐఏఎస్‌లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నావర్సిటీలో పట్టభద్రులయ్యారు. 

కల సాకారం 
యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వీరిలో సుస్మిత ఆంధ్రప్రదేశ్‌ బ్యాచ్‌ ఐపీఎస్‌గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య తమిళనాడులోని తూత్తుకుడి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్‌గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్‌ విధుల్లో రాణిస్తున్నారు. 

తన కుమార్తెల గురించి రామనాథన్‌ మాట్లాడుతూ తన పిల్లలు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్‌లుగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ గగన్‌ దీప్‌ సింగ్‌బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్‌ సర్వీసులో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)