Breaking News

బీసీలపై అగ్రవర్ణం దాడులు

Published on Mon, 01/19/2026 - 04:41

ఇంకొల్లు (చినగంజాం): దేవుని ఊరేగింపు విషయంలో తలెత్తిన వివాదం రెండువర్గాల మధ్య విద్వేషాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీల ఇళ్లపై ఒక అగ్రవర్ణం దాడులకు దిగింది. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నాగండ్ల గ్రామంలో ఏటా సంక్రాంతి పండుగ రోజున గ్రామంలో మాధవయ్యస్వామి ఊరేగింపును బీసీలు, కనుమ రోజున అగ్రవర్ణం నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున ఎప్పటిలా బీసీలు ఊరేగింపు నిర్వహిస్తుండగా అగ్రవర్ణం వారితో చిన్నపాటి ఘర్షణ జరిగింది. కనుమ రోజున అగ్రవర్ణం ఊరేగింపు నిర్వహించేందుకు సిద్ధంకాగా.. ఊరేగింపు వాహనం వెళ్లే మార్గంలో బీసీలు బైక్‌ స్లో రేసింగ్‌ పోటీలు ఏర్పాటు చేశారు.

దీంతో రెండువర్గాల మధ్య మరోసారి చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో పోలీసులు రెండువర్గాల వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. అయితే, ఈ నెల 17వ తేదీన అగ్రవర్ణానికి  చెందిన కొందరు బీసీ మహిళతో ఘర్షణకు దిగడంతో ఆమె బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు సామూహికంగా బీసీల ఇళ్లపై దాడికి దిగారు. కర్రలు, ఇసుపరాడ్లతో దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. దాడిలో కయ్యాల సింగయ్యకు తల పగలగా, కయ్యాల శ్రావణి, కయ్యాల కోటేశ్వరమ్మ, తిరుపతమ్మ, కయ్యాల రమణ, నాగరాజు, సర్పంచ్‌ పద్మ భర్త కంచుగంటి వెంకటేశ్వర్లుపై టీడీపీకి చెందిన వారు విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు వాపోయారు.

తమపై పథకం ప్రకారమే దాడిపర్తి వాసు, పవన్, యర్రమాసు హరిబాబు, ఈదర వెంకటేశ్వర్లు, ఉమ, రామారావు, ఈదర వెంకటేశ్వర్లు, పేర్ని నవీన్, రవీంద్ర, రమేష్, కె.పవన్, అనిల్, సుజాత, అశోక్‌ తదితరులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. గాయాలపాలైన సింగయ్య తదితరులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడిలో గాయపడిన కయ్యాల సింగయ్య ఫిర్యాదు మేరకు 8 మందితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్టు ఎన్‌ఐ సురేష్‌ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)