Breaking News

కొల్లూరులో రెస్టారెంట్‌ ధ్వంసం

Published on Tue, 01/28/2025 - 05:42

కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరులో ఈనాడు గ్రాండ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు ఆందోళనకు దిగారు. పోలీసులు, రెస్టారెంట్‌ నిర్వాహకుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్‌ప్రసాద్‌ ఆదివారం అర్ధరాత్రి రెస్టారెంట్‌ నిర్వాహకులకు రెండు పర్యాయాలు ఫోన్‌ చేసి అసభ్యపదజాలంతో దూషించారు. అంతేగాక రెస్టారెంట్‌ ఏమవుతుందో చూసుకోవాలంటూ హెచ్చరించారు.

అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం నిర్వాహకులు వచ్చి చూసే సరికి రెస్టారెంట్‌ ధ్వంసమై కనిపించింది. దీంతో నిర్వాహకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తెనాలి–రేపల్లె రహదారిపై కొల్లూరు బస్టాండ్‌ సెంటర్లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గతంలో మద్యం దుకాణాల టెండర్ల సమయంలో ఇదే టీడీపీ నేత తాము వేసిన రూ.4 లక్షలు విలువ చేసే రెండు టెండర్ల డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రెస్టారెంట్‌ నిర్వాహకుడు గిరికుమార్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కొల్లూరు ఎస్‌ఐ ఏడుకొండలు చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)