Breaking News

CM Jagan: జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్‌ 

Published on Fri, 11/25/2022 - 12:15

సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆహ్వానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్‌ ఆఫ్‌ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు భారత్‌ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు.

భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం.   

చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే)

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)