Breaking News

మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్‌

Published on Tue, 02/20/2024 - 03:47

సాక్షి, అమరావతి: ప్రజల మానసిక ఆరోగ్య సంరక్షణకు ఏపీ ప్రభు­త్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించడం, వారి హక్కులను కాపాడటమే లక్ష్యంగా మానసిక ఆరోగ్య సం­రక్షణ చట్టాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం అమలుపై రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలిచ్చింది. కాగా, చట్టం అమల్లో భాగంగా సీఎం జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ వర్క్‌షాప్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. మన రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలను త్వరలో ప్రత్యేకంగా తెలుసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్‌ సెక్రటరీ ఎల్‌ఎస్‌ ఛాంగ్సన్‌ పేర్కొన్నారు.

ప్రత్యేక బోర్డ్‌ల ఏర్పాటు
మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమల్లో భాగంగా ప్రభు­త్వం ఇప్పటికే స్టేట్‌ మెంటల్‌ హెల్త్‌ అథారిటీ(ఎస్‌ఎంహెచ్‌ఏ)తో పా­టు, విశాఖపట్నం, ఎన్టీఆర్, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో రీజిన­ల్‌ రివ్యూ బోర్డ్‌ల ఏర్పాటును చేపట్టింది. ఎస్‌ఎంహెచ్‌ఏలో రాష్ట్రంలో మానసిక రోగులకు చికిత్సలు అందించేలా ఆస్పత్రుల రిజి్రస్టేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ 52 మెంటల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్‌లు రిజిస్ట్రర్‌ చేసుకున్నాయి. మరోవైపు మా­న­సిక స్థితి సరిగా లేక, రోడ్లపై తిరిగే నిరాశ్రయులను ఆదుకునే చర్యల్లో భాగంగా శ్రద్ధ రిహెబిలిటేషన్‌ ఫౌండేషన్‌తో వైద్య శాఖ ఎంవోయూ చేసుకుంది.

మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరిగే వా­రిని గుర్తించి శ్రద్ధ ఫౌండేషన్‌ ద్వారా చికిత్సలు అందిస్తున్నా­రు. ఇలా ఇప్పటి వరకూ వంద మంది బాధితులకు చికిత్సలు అందించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. మరోవైపు యువతలో ఆత్మహత్యల నియంత్రణకు ఎమోషనల్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ బై ఎడ్యుకేటర్స్, రెఫరల్‌ ఇన్‌ ఏపీ(ఈఏఎస్‌ఈ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నిమ్‌హాన్స్, అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియా ఆరిజన్‌(ఆపీ) వంటి ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వా­మ్యం అవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేల మందికిపైగా ఎంబీబీఎస్‌ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)