Breaking News

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Published on Sat, 02/08/2025 - 04:42

సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వ్‌ జోన్‌(South Coast Railway Zone) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం పోస్ట్‌ ఫ్యాక్టో (అప్పటికే మొదలుపెట్టిన పనికి) అమోదం తెలిపింది. ప్రధాని మోదీ(Narendra Modi) అధ్యక్షతన శుక్ర­వారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌పై చర్చించి ఆమోదం తెలిపారు. వాల్తేర్‌ డివిజన్‌ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మార్చేందుకు కూడా కేంద్ర కేబినెట్‌(Union Cabinet) ఆమోదం తెలి­పింది. 

గతంలో కుదించిన వాల్తేర్‌ డివిజ­న్‌ను కొనసా­గించడం ద్వారా విశాఖ­పట్నం(Visakhapatnam ) వద్ద ప్రతి­పాదిత సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ డివిజ­నల్‌ అధికార పరిధిని సవరించినట్లు మంత్రివర్గ సమా­వేశం అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. వాల్తేర్‌ డివిజ­న్‌లో భాగమైన పలాస–విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు – విజయ­నగరం, నౌపాడ జంక్షన్‌ – పర్లాకి­మిడి, బొబ్బిలి జంక్షన్‌– సాలూరు, సింహాచలం నార్త్‌ –­దువ్వాడ బైపాస్, వడ్లపూడి – దువ్వాడ,  విశాఖ­ స్టీల్‌ ప్లాంట్‌ – జగ్గయ­పాలెం (సుమారు 410 కి.మీ) విభాగాలు సౌత్‌ కోస్ట్‌ రైల్వే కింద విశాఖ డివిజన్‌లో కొనసాగుతాయి. 

ఇప్పటి­వరకు వాల్తేర్‌ డివిజన్‌లో భాగమైన కొత్తవలస – బచేలి, కూనేరు – తేరువలి జంక్షన్, సింగాపుర్‌ రోడ్‌– కోరాపుట్, పర్లాకిమిడి – ఘన్‌పూర్‌ (సుమారు 680 కి.మీ) విభా­గాలు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో రాయగడ ప్రధాన కేంద్రంగా ఏర్పడుతున్న రాయ­గడ డివిజన్‌లో ఉంటాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)