Breaking News

మీ కులం.. మతం ఏమిటి?

Published on Fri, 12/26/2025 - 05:26

ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సమస్తం తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సేకరించనుంది. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో దీన్ని పోల్చనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సాక్షి, అమరావతి: ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారం సమస్తం గుప్పిట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆధార్‌ కార్డుల్లో పౌరుల సమగ్ర సమాచారం ఉన్నప్పటికీ ‘ఫ్యామిలీ బెనిఫిట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరా తీయడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయంగా వినియోగించుకోవాలనే దుర్బుద్ధితోనే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారనే సందేహాలు ముసురుకుంటున్నాయి. 

పెన్షన్లు, రేషన్‌ కార్డులు, స్కాలర్‌షిప్‌లు ట్రాకింగ్‌..!
ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో పౌరుల వ్యక్తిగత సమాచాన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే ద్వారా ఇంటింటికి వెళ్లి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో దీన్ని పోల్చనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏకీకృత కుటుంబ సర్వే ఆధారంగా ‘స్మార్ట్‌ ఫ్యామిలీ’ కార్డు జారీ చేయనున్నారు. పెన్షన్లు, రేషన్‌ కార్డులు, స్కాలర్‌షిప్‌లు, కుల ధృవీకరణ, ఇతర పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలను ఫ్యామిలీ కార్డు ద్వారా ట్రాకింగ్‌ చేయనున్నారు. 

డేటా లేక్‌లో నిక్షిప్తం 
ఏకీకృత కుటుంబ సర్వే ద్వారా కులం, మతం, పంట అమ్మకం ద్వారా ఎంత వచ్చింది? తదితర వివరాలతో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. వివిధ వర్గాల నుంచి ఇలా తీసుకున్న వ్యక్తిగత సమాచారాన్ని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ డేటా లేక్‌లో నిక్షిప్తం చేయనున్నారు. సర్వే ప్రశ్నావళి చూస్తుంటే కచ్చితంగా ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇప్పటికే ఆధార్‌తో పాటు రేషన్‌ కార్డుల్లో పౌరుల సమాచారం ఉండగా కొత్తగా ఏకీకృత కుటుంబ సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలను సేకరించాల్సిన అవసరం ఏముందని పేర్కొంటున్నాయి. కొత్తగా రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడంతో పాటు క్యూఆర్‌ కోడ్‌తో ఫ్యామిలీ కార్డు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సర్వే ద్వారా సమాచారం సేకరించాక కుటుంబాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఐదు వర్గాలుగా విభజించనున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)