Breaking News

విభజనపై పార్లమెంటులో చర్చకు కృషి చేయండి

Published on Wed, 12/11/2024 - 05:23

సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రాన్ని విభజించిన తీరు, తద్వారా ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరిగేలా నోటీసు ఇప్పించాలని జనసేన అధి­నేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు జనసేన అధినేత, ఉప ముఖ్య­మంత్రి పవన్‌ కళ్యాణ్‌కు రాసిన లేఖను మంగళవా­రం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. 2014 నుంచి జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. 

‘2014 ఫిబ్రవరి 18న రాష్ట్ర విభజన బిల్లుపై ఎటువంటి చర్చా జరగకుండా.. ఎంతమంది విభజనకు అనుకూలమో.. ఎంతమంది వ్యతిరేకమో డివిజన్‌ ద్వారా లెక్క తేల్చకుండా, తలుపులు మూసేసి టీవీ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్‌సభలో ప్రకటించారు. ఈ విషయం మీకు తెలిసిందే..’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పదేళ్లుగా నడుసూ్తనే ఉన్నా... కేంద్రం నేటికీ కనీసం కౌంటర్‌ దాఖలు చేయలేదు. 

2018 ఫిబ్రవరి 18న మీరు(పవన్‌) ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన బకాయిలు రూ.74,542 కోట్లుగా లెక్క తేల్చింది. 2018 జూలై 16న అప్పటి సీఎం చంద్రబాబును కలిసి లోక్‌సభలో జరిగిన దుర్మార్గం గురించి వివరించాను. నేను చూపించిన లోక్‌సభ రికార్డులను పరిశీలించిన చంద్రబాబు నా వాదనతో ఏకీభవించి, లోక్‌సభలో ఈ విషయం చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున అఫిడవిట్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. కారణాలేమైనా అవి అమలు కాలేదు.

2019 జనవరి 29న విజయవాడలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్‌సీపీ, సీపీఎం తప్ప మిగిలిన ముఖ్య పార్టీల నేతలందరూ హాజరయ్యా­రు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు స్వయంగా హాజరయ్యారు. 2019 ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా, మనకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజు సమావేశంలో తీర్మానించుకున్నాం. ఇప్పుడు మీరు, చంద్రబాబు ఇద్దరూ బీజేపీతో కలిసి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోను, సహకరించిన బీజేపీ కేంద్రంలోను అధికారంలో ఉన్నాయి. 

రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమ­యం. మీరిద్దరూ శ్రద్ధ తీసుకుని, పార్లమెంట్‌ ఉభయ సభల్లో రాష్ట్ర విభజనపై, జరిగిన అన్యాయ­ంపై చర్చకు నోటీసులు ఇప్పించాలి. దీంతో­పాటు సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలి.’ అని ఉండవల్లి ఆ లేఖలో పేర్కొన్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)