Breaking News

భారీగా పెరిగిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌!

Published on Sun, 01/18/2026 - 05:43

సాక్షి, అమరావతి: దేశంలో వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల్లో క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2005లో కోటి ఖాతాల్లో కేవలం రూ.918 కోట్ల క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు ఉండగా.. 2015 నుంచి ఆ విలువ భారీగా పెరిగినట్లుగా పేర్కొంది. 2024 నాటికి 20 కోట్ల ఖాతాల్లో రూ.62,314 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. క్లెయిమ్‌ చేయని మొత్తంలో 75 శాతం సేవింగ్స్‌ ఖాతాల్లోనివేనని, అందులో 82 శాతం వాటా పబ్లిక్‌ సరీ్వస్‌ సెక్టార్‌ బ్యాంకుల్లోనే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల ఖాతాలపై బ్యాంకులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ.. ఇంకా నగదు ఎక్కువగానే ఉంటోంది. క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను హక్కుదారులకు తిరిగి ఇవ్వడానికి కస్టమర్లకు చెందిన చట్టపరమైన వారసుల స్థానాన్ని కనుగొనేందుకు బ్యాంకులు ప్రత్యేక కార్యక్రమాలను  చేపడుతున్నాయి. క్లెయిమ్స్‌ ఫిర్యాదులు త్వరగా పరిష్కారం, రికార్డుల నిర్వహణ, క్లెయిమ్‌ చేయని డిపాజిట్‌ ఖాతాల కాలానుగుణ సమీక్ష కోసం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి. న్యాయమైన హక్కుదారులకు సహాయం చేయడానికి, బ్యాంకులు లేఖలు, ఈ–మెయిళ్లు లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఖాతాదారులను సంప్రదించడంతో పాటు ఖాతా యాక్టివేషన్, క్లెయిమ్‌ ప్రక్రియపై సమాచారాన్ని అందించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నాయి.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)