Breaking News

సొమ్ము సర్కారుది.. సోకు కాంట్రాక్టరుది..

Published on Thu, 05/22/2025 - 05:32

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి బరితెగించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీ­డీసీ) వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గండికోట పర్యాటక ప్రాంతంలో 3.94 ఎకరాల్లో రూ.5.04 కోట్లతో ‘టెంట్‌ సిటీ’ నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా.. కాంట్రాక్టు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. 

అయితే, టీడీపీ కూటమి పెద్దలకు చెందిన అస్మదీ­యులకు ఆయాచితంగా లబ్ధిచేకూర్చేందుకు టెండర్‌ పద్ధతినే మార్చేసింది. పైకి నీతి ఆయోగ్‌ నమూనాను అనుసరి­స్తున్నామనే రీతిలో బిల్డప్‌ ఇస్తూ లోపాయి­కారిగా నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఇందులో సదరు కాంట్రాక్టరు పైసా పెట్టుబడి పెట్ట­కుండా ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణాలు చేసుకుని వచ్చిన ఆదాయాన్ని అనుభవించేలా నిబంధనలుండటం కొసమెరుపు!

ఎక్కడాలేని రీతిలో టెండర్‌..
ఏపీటీడీసీ టెంట్‌ సిటీ నిర్మాణానికి పిలిచిన టెండర్లను పరిశీలిస్తే లోగుట్టు ఇట్టే అర్థమ­వుతుంది. ఎక్కడైనా అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులతో నిర్మాణా­లు చేస్తే వాటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద గుర్తిస్తారు. ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల్లో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) పద్ధతిలో నిర్మాణాలు చేయిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు, డిజైన్లకు లోబడి నిర్మాణాలుంటే కాంట్రాక్టరు­కు బిల్లులు చెల్లిస్తుంది. 

మరో పద్ధతిలో.. అ­ప్ప­టికే ఉన్న ఆస్తుల నిర్వహణకు లీజు ప్రాతి­పదికపైన ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆప­రేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) కిందకి వస్తుంది. కానీ, టెంట్‌ సిటీకి కోసం ఏపీటీడీసీ పిలిచిన టెండర్లలో మాత్రం భూమి ప్రభుత్వానిది.. నిర్మాణ పెట్టుబడీ ప్రభుత్వానిదే.. కట్టేది కాంట్రాక్టరు. పైగా.. 33 ఏళ్ల పాటు దీనిని అనుభవించేది కూడా సదరు కాంట్రాక్టరే! 

దేశంలో ఎక్కడాలేని రీతిలో ఏపీటీడీసీ తీసుకొచ్చిన కొత్త తరహా టెండర్‌ ఇది! స్థానిక టీడీపీ కూటమి ప్రజాప్రతినిధికి చెందిన హోటల్‌ రంగంలోని వ్యక్తులకు ఈ టెంట్‌ సిటీని కట్టబెట్టేందుకు అనుభవంతో పనిలేకుండా తెలివిగా నిబంధనలు రూపొందించారని ఆరోపణ­లు వస్తున్నాయి. అలాగే, ఈ టెంట్‌ సిటీ నిర్వహణ ప్రారంభమైన 11 ఏళ్ల తర్వాతే లీజు రెంట్‌ పెంపు నిర్ణయం కొసమెరుపు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)