Breaking News

టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రవేశం

Published on Sat, 07/18/2026 - 12:24

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అదే సమయంలో తమిళనాడు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్, వారి కుటుంబ సభ్యులతో కూడిన బృందానికి టీటీడీ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ఆ అధికారిక జాబితాలో లేని వ్యక్తి వారితో పాటు లోపలికి వెళ్లాడని ఆరోపిస్తున్నారు. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్‌ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.   

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)